ఈసారి న్యూఇయర్ వేళ అత్యధిక ఆర్డర్లు వచ్చిన ఫుడ్ ఇదే..!
ఈసారి కొత్త ఏడాది సంబరాలు గతంలో కంటే చాలా సందడిగా జరిగాయి. కారణాలు ఏవైనా జనంలో ఈసారి ఎక్కడా లేని జోష్ కనిపించింది. కొత్త ఏడాది సందర్భంగా హోటల్స్, రెస్టారెంట్స్ ఆహార ప్రియులతో నిండిపోయాయి. అదే సమయంలో ఇళ్ల వద్ద కూడా భారీగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆరగించారు. అయితే ఈసారి ఫుడ్ యాప్స్ లో జనం ఎక్కువగా ఆర్డర్ చేసి తిన్న పుడ్స్ పై ఆసక్తికరమైన డేటా ఒకటి బయటికి వచ్చింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ ఏడాది న్యూఇయర్ సందర్భంగా తమ ప్లాట్ ఫామ్ పై జనం ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారపదార్ధాలు ఏంటో వివరిస్తూ గణాంకాలు విడుదల చేసింది. ఇందులో బిర్యానీల నుంచి పిజ్జాల వరకూ చాలా ఫుడ్స్ ఉన్నాయి. అయితే అందులో టాప్ లో నిలిచింది మాత్రం బిర్యానీయే. నిన్న సాయంత్రం కొత్త సంవత్సరం వేడుకలు పూర్తిగా మొదలుకాకముందే స్విగ్గీలో బిర్యానీ కోసం ఏకంగా 2.18 లక్షల ఆర్డర్లు వచ్చాయట. ఆ తర్వాత కూడా ఈ బిర్యానీ హవా కొనసాగినట్లు తెలుస్తోంది.

అలాగే బిర్యానీ తర్వాత స్ధానంలో జనం ఆర్డర్ చేసిన ఫుడ్స్ లో బర్గర్స్ ఉన్నాయట. నిన్న సాయంత్రానికి స్విగ్గీ ప్లాట్ ఫామ్ పై ఏకంగా 90 వేల బర్గర్ ఆర్డర్లు వచ్చాయట. అయితే రెగ్యులర్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తో పాటు సంప్రదాయ టిఫిన్ ఫుడ్ అయిన ఉప్మా కోసం కూడా గణనీయంగా ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. వీటితో పాటు బెంగళూరులో అయితే సలాడ్ కోసం ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. అలాగే కిచిడీ, క్యారట్ హల్వా కోసం కూడా భారీగానే ఆర్డర్లు వచ్చాయట. చివరిగా గులాజ్ జామ్, టీ కోసం కూడా అర్ధరాత్రి కూడా ఆర్దర్లు వచ్చినట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications