వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అదికారంలోకి రాదు..! జోష్యం చెప్పిన మమతాబెనర్జీ..!!

|
Google Oneindia TeluguNews

కోల్ కత్తా/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే కొలువుతీరుతుందని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి 150 స్థానాలు వస్తాయని, బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా విస్పష్ట మెజారిటీ రాదని స్పష్టం చేశారు. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. 2014లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీకి 73 స్థానాలు దక్కడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. యూపీలో ఈసారి బీజేపీకి 13 నుంచి 17 స్థానాలు మాత్రమే లభిస్తాయని, ఎస్పీ-బీఎస్పీకి 55 స్థానాలు వస్తే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు.

The BJP does not come into power in any situation.!Mamata Banerjee said of the prophecy.!!

ప్రధాని రేసులో ఎవరుంటారనేది ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలు నిర్ణయిస్తాయని చెప్పారు. మమతా బెనర్జీ మంగళవారం ఓ వార్తాచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. మోదీ భయభ్రాంతులకు గురిచేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ సర్కార్‌పై గళమెత్తిన వారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను సీబీఐ దాడులకు భయపడనని, బీజేపీని అధికారం నుంచి సాగనంపి దేశాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 125-150 స్థానాలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్‌కు సైగం 125-130 స్థానాలు లభిస్తాయని, ప్రాంతీయ పార్టీలు జతకడితే బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు కూటమి వైపు ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

English summary
West Bengal Chief Minister and Trinamool Congress chief Mamata Banerjee said that after the general election, the non-BJP government would be set up at the Center. With the allies, the BJP will have 150 seats and it is clear that the BJP is the single largest party but no clear majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X