బాలుడ్ని తలకిందులు వేలాడదీసి కొట్టాడు

భోపాల్: స్కూల్ కు వెళ్లలేదని బాలుడిని పట్టుకున్న అతని మేనమామ ఇప్పటి వరకు ఎవ్వరూ శిక్షించని విధంగా అతనికి శిక్ష విధించాడు. రాక్షసుడిలా ప్రవర్తించిన అతనిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

మధ్యప్రదేశ్ లోని రైజిమ్ జిల్లాలోని ఓబేదుల్లా గంజ్ అనే గ్రామంలో బిజ్రేశ్ యాదవ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి 10 సంవత్సరాల వయస్సు ఉన్న మేనల్లుడు ఉన్నాడు. ఆ బాలుడు స్కూల్ కు వెళ్లకుండా ఓ రోజు గ్రామంలోనే స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న బిజ్రేశ్ యాదవ్ ఊగిపోయాడు. అంతే బాలుడుని పట్టుకుని కొట్టుకుంటూ ఊరి మధ్యలోని రచ్చబండ దగ్గరకు తీసుకు వెళ్లాడు. అప్పటికే రచ్చబండ దగ్గర కొందరు కూర్చుని మాట్లాడు కుంటున్నారు.

The boy is seen hanging from a tree in what appeared to be a public square.

అయితే అవేవి పట్టించుకోని బిజ్రేశ్ యాదవ్ అందరి ముందు మేనల్లుడి కాళ్లను తాళ్లతో కట్టేసి తల్లకిందులుగా ఆ చెట్టుకు వేలాడదీశాడు. అంతే కాకుండ కర్ర తీసుకుని బాలుడిని కొట్టడం ప్రారంభించాడు. బాలుడు కేకలు వేసినా పట్టించుకోలేదు. అందరూ బాలుడిని చూసి నవ్వుకున్నారు.

అంతే గాని ఆర్తనాదాలు చేస్తున్న ఆ బాలుడిని విడిపించడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. అయితే కొందరు ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కర్కశంగా ప్రవర్తించిన బిజ్రేశ్ యాదవ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+