వ్యాపం స్కాం: సీబీఐకి మూడు వారాల టైం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వ్యాపం కుంభకోణం కేసుల దర్యాప్తు మూడు వారాలలో చేపట్టాలని సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ లోని వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న 72 కేసులను తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ సీ. నాగప్పన్, జస్టిస్ అమిత్వా రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వ్యాపం స్కాం కేసు విచారణ చేశారు. ఈ సందర్బంలో ఈ విధంగా స్పందించారు.

The Central Bureau of Investigation (CBI) to take over all Vyapam scam cases

వ్యాపం కుంభకోణం కేసులు వాదించడానికి 48 మంది ప్రభుత్వ న్యాయవాదులను నియమించడానికి కూడా సీబీఐకి మూడు వారాలు సమయం ఇచ్చింది. ట్రయల్ కోర్టులలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటామని సీబీఐకి సుప్రీం కోర్టు భరోసాయిచ్చింది. కేసు విచారణ అక్టోబర్ 9వ తేదికి వాయిదా వేశారు.

మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కాం కుదిపేసింది. అక్కడి మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికారులకు ఈ స్కాంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఉద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

పలువురు మాయమయ్యారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లోని వివిద పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదు అయ్యాయి. కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+