సైలెంట్ గా చీటి చింపేస్తున్న సిద్దరామయ్య, డీకేకి ఆలా చెక్, హైకమాండ్ రూటే సపరేటు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధిక సీట్లు కైవసం చేసుకుని ఎవ్వరితో పొత్తు లేకుండా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మరోసారి మాదే అధికారం అని ధీమాగా చెబుతోంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరి ధీమాతో వాళ్లు ఉన్నారు.
మీరు ఎంత గింజుకున్నా మేము లేకుండా ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని జేడీఎస్ పార్టీ అంటోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థుల రేసులో ఉన్న మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ వారి మద్దతుదారులకు టిక్కెట్లు ఇప్పించుకునే విషయంలో పోటీపడుతున్నారు.
అయితే సైలెంట్ గా ఉంటున్న మాజీ సీఎం సిద్దరామయ్య ఆయనపని ఆయన చేసుకుంటూ వెలుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ గురువారం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలోని 124 మందిలో, రెండో జాబితాలోని 42 మందిలో ఎక్కువ మంది సిద్దరామయ్య అనుచరులే ఉన్నారు.

రెండో జాబితాలో శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ విద్యాశాఖా మంత్రి కిమ్మనరత్నాకర్ కు టిక్కెట్ దక్కకుండా డీకే శివకుమార్ అనుచరుడు పోటీ పడ్డారు. అయితే చివరికి కిమ్మన రాత్నాకర్ కు సీటు దక్కింది. సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో రత్నాకర్ మంత్రిగా పని చేశారు. సిద్దరామయ్య మరో ప్రియ శిష్యుడు ఇక్బాల్ అన్సారీకి రెండో జాబితాలో సీటు దక్కింది.
కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద శింగ్లావిలో పోటీ చెయ్యాలని అనుకున్న మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి ( హత్య కేసులో ప్రస్తుతం నిందితుడు) ధారవాడ సీటు దక్కింది. ధారవాడ జిల్లాలోని కలఘటగి నియోజక వర్గంలో సంతోష్ లాడ్ కు సీటు దక్కింది. సంతోష్ లాడ్ కు సీటు దక్కకుండా డీకే శివకుమార్ శిష్యుడు నాగరాజ్ అబ్బి చివరి వరకు పోటీపడ్డాడు.
గదగ్ జిల్లాలో మాజీ మంత్రి బీఆర్, యావగల్, బాదామిలో మాజీ మంత్రి చిమ్మనకట్టి కుమారుడు బీమ్ సేన్ తదితరులు రెండో జాబితాలో ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాధించుకున్నారు. అయితే పై నియోజక వర్గాల్లో డీకే శికుమార్ అనుచరులు గట్టి పోటీ ఇచ్చినా చివరికి సిద్దరామయ్య అనుచరులకే టిక్కెట్లు దక్కాయి. రెండో జాబితాలో తన వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వలేదని డీకే. శివకుమార్ అసహనంతో ఉన్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications