సీఎం ఎవరు అని ఢిల్లీలో డిసైడ్ అవుతుంది, 140 నాటౌట్ అంటున్న డీకేశీ, అయితే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత అధికారం మాదే అని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సర్వేలు బీజేపీకి, కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. కొన్ని సర్వేలు మాత్రం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, ఈసారికూడా జేడీఎస్ కింగ్ మేకర్ అని స్పష్టం చేశాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ కచ్చితంగా 140 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటుందని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన తరువాత ఎవరిని సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో డిసైడ్ చేస్తుందని డీకే. శివకుమార్ స్పష్టం చేశారు.

శనివారం డీకే. శివకుమార్ పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం పదవి కోసం పోట్లాడుకోవడం లేదని అన్నారు. సీఎం సీటు విషయంలో మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ పోట్లాడుకుంటున్నారని కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీకే. శివకుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఈనాటిది కాదు. ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం సీటు ఎవ్వరికి ఇవ్వాలని అని అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో ఉన్న నాయకులు అందరితో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటుందని డీకే. శివకుమార్ చెప్పారు.

కేపీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒక్కరోజు కూడా నిద్రపోకుండా బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నానని, 78 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇచ్చామని, మేకదాటు ప్రాజెక్టు విషయంలో పోరాటం చేశామని, రాహుల్ గాంధీ జూడో యాత్ర కర్ణాటకలో విజయవంతం అయ్యేలా చేశానని డీకే శివకుమార్ చెప్పారు.
సీఎం సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని డీకే. శివకుమార్ స్పష్టం చేశారు. అయితే తాను సీఎం రేసులో ఉన్నానని, సీఎం రేసులో లేనని మాత్రం డీకే శివకుమార్ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని డీకే .శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications