కూతురు కాదు కన్నింగ్ లేడీ, తల్లిని చంపి ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచిలో, రాత్రి ఏం జరిగింది ?, ఎందుకు ?
నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ప్లాస్టిక్ సంచిలో బయటపడింది. మహిళను ఆమె 22 ఏళ్ల కుమార్తె హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముంబాయి/బాంధ్రా: మహిళ, ఆమె కుమార్తె కలిసి నివాసం ఉంటున్నారు. మహిళ ఆమె కుమార్తెను చాలా ప్రేమాగా చూసుకునేదని తెలిసింది. నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ప్లాస్టిక్ సంచిలో బయటపడటం కలకలం రేపింది. మహిళను ఆమె 22 ఏళ్ల కుమార్తె హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని పోలీసులు తెలిపారు. కన్న తల్లిని ఆమె కూతురు ఎందుకు హత్య చేసింది ? అనే పాయింట్ ఇప్పుడు ?.

తల్లీ, కూతురు
ముంబాయి నగరంలోని లాల్ బాగ్ ఏరియాలోని ఇబ్రహీం కసమ్ భవనంలోని మొదటి అంతస్తులో ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం బయటపడింది. మృతి చెందిన మహిళ కుమార్తె 22 ఏళ్లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన మహిళను వీణా ప్రకాష్ జైన్ అలియాస్ వీణా జైన్ (55) అని గుర్తించాయని ముంబాయి డీసీపీ ప్రవీణ్ ముండే స్థానిక మీడియాకు చెప్పారు.

దుర్వాసన వస్తోందని వెళితే ?
మంగళవారం సాయంత్రం వీణా ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని మాకు సమాచారం అందిందని, తరవాత అక్కడికి వెళ్లి చూస్తే ముక్కలు ముక్కలు అయిన ఆమె శవం ప్లాస్టిక్ సంచిలో బయటపడిందని, కేసు విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ముంబాయి పోలీసు అధికారి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు.

నెల రోజుల నుంచి మాయం
వీణా జైన్ మృతదేహం క్షణ్ణంగా పరిశీలిస్తే కొద్ది రోజుల క్రితమే ఆమె హత్యకు గురైయ్యిందని ముంబాయి పోలీసు వర్గాలు తెలిపాయి. మృతురాలు వీణా జైన్ సోదరుడు కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో ఆమె అదృశ్యంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీణా జైన్ ఇంటి ఇరుగుపొరుగు వారిని విచారించారు.సుమారు నెల రోజులుగా వీణా జైన్ మాకు కనిపించలేదని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు.

కూతురు ఎందుకు చంపింది ?
వీణా జైన్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, పోలీసులు గానీ, ఇరుగుపొరుగువారు గానీ ఇన్ని రోజులు దుర్వాసన పసిగట్టలేకపోయారని, ఆమె హత్యకు గురైన విషయం ఊహించలేపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. వీణా జైన్ ను హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని పదునైన ఆయుధంతో చేతులు, కాళ్లతో సహా శరీరం ముక్కలు చేసి నరికి ప్లాస్టిక్ సంచిలో పెట్టారని ముంబాయి పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి బాధితురాలు వీణా జైన్ ఇంట్లో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించామని, వీణా జైన్ కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications