నేడు ఢిల్లీ కోర్టు ముందుకు టీటీవీ దినకరన్: మళ్లీ కస్టడీకి ఇవ్వాలని!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ ను సోమవారం ఢిల్లీలోని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఎన్నికల యంత్రాగానికి రూ. 50 లక్షలు లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

దినకరన్ భార్య అనురాధ మెడకు లంచం కేసు: పిచ్చి చేష్టలకు దిమ్మతిరిగింది!

కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చెన్నైలోని టీటీవీ దినకరన్ ఇంటిలో, ఆయనకు సంబంధం ఉన్న వారి ఇండ్లలో పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

The Delhi police, which is presently introgate TTV Dinakaran will present him in the Delhi court today.

తమిళనాడులో టీటీవీ దినకరన్ తో సంబంధం ఉన్న వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. టీటీవీ దినకరన్ కు నగదు సమకూర్చిన వారిని అరెస్టు చెయ్యడానికి ఢిల్లీ పోలీసులు రంగం సిద్దం చేశారని తెలిసింది.

డిప్రెషన్‌‌లో శశికళ: జైల్లో క్షీణించిన ఆరోగ్యం, ఆస్తుల కోసం బంధువుల ఒత్తిడి!

న్యాయస్థానం ఇచ్చిన కస్టడి గడువు పూర్తి కావడంతో ఢిల్లీ పోలీసులు దినకరన్ ను మళ్లీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. టీటీవీ దినకరన్ ను మళ్లీ కస్టడీకి తీసుకోవాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానంలో మనవి చెయ్యాలని నిర్ణయించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Delhi police, which is presently interrogate TTV Dinakaran will present him in the Delhi court today, may be required to extend his police custody.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి