ఘోరంః ఫోన్ మాట్లాడొద్దు అన్నందుకు.. అన్నను నరికి చంపేసిన బాలిక
సెల్ ఫోన్‌లు పిల్లలపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతాయనేందుకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘోరమైన ఘటనే ఉదాహరణ. సున్నిత మనష్కులైన చిన్నారుల్లోనూ క్రూరత్వాన్ని నూరిపోస్తున్న సెల్ ఫోన్ మహమ్మారికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. చిన్నవయసులో సెల్ ఫోన్‌కు బానిసైన ఓ చిన్నారి చెతులను రక్తంతో తడిసేలా చేసి, సొంత అన్న ఆయువు తీసేసింది.
అబ్బాయిలతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో ఆ చెల్లెలు చేసిన ఘాతకం.. ప్రతి ఒక్క తల్లిదండ్రుల గుండెల్లో గుబులుపుట్టించేలా చేసింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఖైరాగఢ్-ఛుయిఖదాన్-గండయి జిల్లాలోని అమ్లీదిఖాలా గ్రామంలో శుక్రవారం ఓ 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్లీదిఖాలా గ్రామంలో నివాసం ఉంటోన్న ఓ కుటుంబం ఎప్పటిలాగే శుక్రవారం కూలి పనులకు వెళ్లింది. అయితే ఆ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికతోపాటు తన కంటే నాలుగేళ్లు పెద్దవాడైన అన్నతో కలిసి ఇంట్లోనే ఉంది. అందరూ బయటకు వెళ్లాక ఆ బాలిక ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టింది. అలా చాలాసేపు మాట్లాడేసరికి ఆ అన్న మందలించాడు. అబ్బాయిలతో ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం మంచిది కాదని, ఫోన్‌కు దూరంగా ఉండాలని హితవు పలికాడు. దీంతో ఆ బాలిక ఫోన్‌ను పక్కన పెట్టేసింది. తన మాటకు గౌరవం ఇచ్చిన చెల్లిని చూసి ఆ అన్న మురిసిపోయాడు. కొంత సేపటికి అలా నిద్రలోకి జారుకున్నాడు.

పొంతనలేని సమాధానాలతో..
అయితే, తనను ఫోన్ మాట్లాడొద్దన్న అన్నపై ఆగ్రహంతో రగిలిపోయింది ఆ బాలిక. అదును కోసం వేసి చూసింది. తన అన్న గాఢ నిద్రలో ఉండగా పదునైన గొడ్డలితో గొంతుపై ఒక్క వేటుతో నరికి చంపేసింది. తర్వాత తన బట్టలపై పడిన రక్తపు మరకలను శుభ్రం చేసుకుంది. బయటకు వచ్చి తనకు ఏమీ తెలియనట్లు అన్నను ఎవరో చంపేశారని చుట్టపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదులుపెట్టారు. అయితే, ఆ బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమెను లోతుగా విచారించారు. దీంతో బాలిక అసలు విషయం చెప్పడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఫోన్‌కు దూరంగా ఉండమని చెప్పడంతోనే తన అన్నను హత్య చేశానని బాలిక చెప్పిన సమాధానంతో ఇప్పుడు ఈ హత్యా ఉదంతం వైరల్‌గా మారింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications