రూ. 52 లక్షలను అయోధ్య రామాలయానికి విరాళమిచ్చిన బాలిక...
నేడు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగా వైభవంగా ప్రారంభమైంది. ఈ రోజు కోసమే దేశంలోని ఎంతో మంది హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ పద్నాలుగేళ్ల బాలిక విరాళం ఇచ్చింది. బాలిక అంటే సహజంగా ఓ లక్ష రూపాయలు ఎంతో విరాళంగా ఇచ్చిందని అందరూ అనుకుంటారు. కానీ, ఈ బాలిక మాత్రం ఏకంగా 52 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఇంతకీ ఈ బాలిక ఎవరో తెలుసుకుందాం పదండి.
ఆ బాలిక వయసు పద్నాలుగు సంవత్సరాలు. ఈ బాలిక అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ. 52లక్షలను విరాళలమిచ్చింది. రామ కథలను చదివి వాటిని చెప్పుందుకు ఈ బాలిక పలు ప్రదర్శనలు ఇచ్చింది. ఈ చిన్నారి పది సంవత్సరాల వయసు నుంచే రామకథలు చెప్పడం ప్రారంభించింది. ఆ కథలు చెబుతూ సేకరించిన విరాళాలను మొత్తం అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాంగా అందజేసింది. ఈ చిన్నారి చేసిన పనికి ఇప్పడు అందరిని ఈమెని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మొదటి సంపాదన లక్ష రూపాయలు...
ఈ బాలిక పేరు భవికా మహేశ్వరి. ఈమె గుజరాత్‌లోని సూరత్ వాసి. ఈ చిన్నారి అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి తెలుసుకుంది. ఆ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం చాలామంది విరాళాలు కూడా ఇచ్చారని తెలుసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తను కూడా విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి రాముని కథలను చదవడం మొదలుపెట్టింది. భవికా చదివిన కథలను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు, లాజ్‌పూర్ జైలు, బహిరంగ సభల్లో రాముని కథలు చెప్పడం ప్రారంభించింది.
అలా, 2021లో లాజ్‌పూర్ జైలులో ఉన్నఖైదీలందరికీ రాముడి కథలు చెప్పగా వారంతా కలిసి ఆ బాలికకు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. అలా భవికా తన 11వ ఏట నుంచే ఇప్పటి వరకూ 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి రాముడి కథలు చెబుతూ 300పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఆ కథలు చెప్పడం ద్వారా మొత్తం రూ.52 లక్షల వరకూ సేకరించింది. తాను సేకరించిన మొత్తం నగదును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చి తన కలను నెరవేర్చుకుంది.
భవికా కేవలం రాముడి కథలను చెప్పడమే కాకుండా 108కిపైగా వీడియోలను రికార్డు చేసి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలను దేశ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది చూశారు. భావిక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కూడా ఓ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు 'సంఘాష్ సే శిఖర్ తక్'. దేశ ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ముని కలిసి, తాను రాసిన పుస్తకాన్ని బహుకరించింది.












Click it and Unblock the Notifications