వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే అత్యధిక డెంగ్యూ కేసులు ఇక్కడే.. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా డెంగ్యూ విజృంభణ

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీని ఇప్పుడు కొత్త సమస్య వేధిస్తుంది. కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఢిల్లీ, ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇదే సమయంలో తాజాగా ఢిల్లీలో డెంగ్యూ కేసులు గతంలో ఎన్నడూ లేనివిధంగా నమోదు కావడం ఢిల్లీ సర్కార్ ను కలవరపెడుతోంది .ఈ ఏడాది ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో వేల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదు కావడం, గత ఆరేళ్లలో ఎప్పుడూ నమోదు కాని విధంగా డెంగ్యూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

ఢిల్లీలో డెంగ్యూ కేసుల సంఖ్య 5,277.. ఆరేళ్లలో ఇదే అత్యధికం
సోమవారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన పౌర నివేదిక ప్రకారం, ఈ సీజన్‌లో ఢిల్లీలో డెంగ్యూ కేసుల సంఖ్య 5,277గా నమోదయ్యాయి. ఇది 2015 నుండి ఇప్పటివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక కేసుల సంఖ్య ఈ ఏడాది నమోదైంది. గత వారం రోజులలోనే అత్యధికంగా ఢిల్లీ నగరంలో దాదాపు 2,570 వెక్టర్-బోర్న్ డిసీజ్ గా చెప్పబడే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నివేదిక ప్రకారం, ఈ ఏడాది నవంబర్ 13 వరకు మొత్తం 5,277 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

The highest number of dengue cases in Delhi; Dengue boom is unprecedented in the last six years

2015లో ఢిల్లీలో డెంగ్యూ పంజా .. గత ఆరేళ్లుగా కేసుల డేటా ఇదే
నివేదిక ప్రకారం, మునుపటి సంవత్సరాల్లో దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన డెంగ్యూ కేసుల మొత్తం సంఖ్య చూస్తే 2016 సంవత్సరంలో 4,431 డెంగ్యూ కేసులు, 2017 సంవత్సరంలో 4,726 కేసులు, 2018 సంవత్సరంలో 2,798 కేసులు, 2019 వ సంవత్సరం లో 2,036 కేసులు 2020 వ సంవత్సరంలో తక్కువగా 1,072 డెంగ్యూ కేసులు నమోదయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2015లో, నగరంలో డెంగ్యూ విపరీతంగా వ్యాప్తి చెందింది. ఈ సమయంలో నివేదించబడిన కేసుల సంఖ్య అక్టోబర్‌లోనే 10,600 దాటింది. ఇది 1996 నుండి జాతీయ రాజధాని ఢిల్లీలో వెక్టర్-బోర్న్ వ్యాధి అయిన డెంగ్యూ కేసులు నమోదు అవుతుండగా, 2015 లోనే విపరీతంగా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది.

2021లో డెంగ్యూ కేసుల నమోదు ఇలా .. మరణాలలోనూ 2017 తర్వాత ఇదే అధికం
ఈ ఏడాది ఢిల్లీలో నమోదైన డెంగ్యూ కేసుల్లో సెప్టెంబరులో 217 కేసులు నమోదయ్యాయి. అక్టోబర్‌లో 1,196 కేసులు నమోదయ్యాయి. నవంబర్ మొదటి 13 రోజుల్లో 3,740 కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది నవంబర్ 6 వరకు మొత్తం కేసుల సంఖ్య 2,708 కాగా, డెంగ్యూ కారణంగా అధికారిక మరణాల సంఖ్య తొమ్మిదిగా నమోదయింది. 2017 సంవత్సరంలో అధికారికంగా నివేదించబడిన మరణాల సంఖ్య 10 , అప్పటినుండి ఇప్పటివరకు దేశ రాజధానిలో ఒక సంవత్సరంలో నమోదైన డెంగ్యూ మరణాల సంఖ్య కూడా ఈ ఏడాది అత్యధికంగా ఉంది.

అలెర్ట్ అయిన ఢిల్లీ సర్కార్ ... డెంగ్యూకు వైద్య సదుపాయాలు కల్పించామన్న వైద్య శాఖా మంత్రి
ఇప్పటికే అప్రమత్తమైన ఢిల్లీ అధికార యంత్రాంగం, డెంగ్యూ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తగిన వైద్య సేవలను అందిస్తుంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో డెంగ్యూ కేసుల సంఖ్య, కేసుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ సర్కార్ భావిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న అన్ని ఆసుపత్రులలోనూ డెంగ్యూ రోగులకోసం కావలసిన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని ఇటీవల ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అలాగే ఏ ఒక్క రోగిని ట్రీట్మెంట్ చేయకుండా వెనక్కి పంపే పరిస్థితి రాబోదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రిలో పడకల సమస్య ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులలో అలాంటి సమస్యలేవీ లేవని డెంగ్యూ నిర్మూలన కోసం ఆప్ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని సత్యేంద్ర జైన్ వెల్లడించారు.

English summary
According to a civic report released by the Delhi Municipal Corporation on Monday, the number of dengue cases in Delhi this season was 5,277. This is the highest number of cases ever recorded since 2015 so far this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X