కూతుర్ల కళ్ల ముందే భార్యను కాల్చి చంపేసిన భర్త, పర్యాటక కేంద్రంలో కలకలం

భర్త అతని భార్యను కాల్చి చంపిన ఘటన కర్ణాటకలోని కొడుకు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు గొడవలు రావడంతో ఒకే ఇంట్లో ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ ఎవరికి వారు వంటలు చేసుకుని తింటున్నారు. అయితే భార్య ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వకుండా భర్త ఆమెను రకరకాలుగా వేధిస్తూ గొడవలు చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భార్య శిల్పా ఆమె భర్త బోపన్నను కోరింది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు ఉండటంతో దంపతులు కోర్టు చూట్టూ వాయిదాలకు తిరుగుతున్నారని తెలిసింది.

The husband shot dead his wife who asked for money for expenses

ప్రతినెలా ఖర్చుల కోసం శిల్పా ఆమె భర్త బోపన్నను డబ్బులు అడిగింది. శనివారం కూడా ఇదే విషయంలో శిల్పా ఆమె భర్త బోపన్నల మద్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. నీ ఖర్చుల కోసం తాను ఒక్కరూపాయి కూడా ఇవ్వనని బోపన్న అతని భార్య శిల్పాకు తేల్చి చెప్పాడు. తరువాత ఆ గొడవ తారాస్థాయికి చేరింది.

ఆ సందర్భంలో మాటామాటా పెరిగిపోయింది సహనం కోల్పోయిన బోపన్న నాటు తుపాకి తీసుకుని అతని భార్య శిల్పాను కాల్చి చంపాడు.

భార్య శిల్పా స్పాట్ లో చనిపోయింది. భార్య శిల్పా ప్రాణం పోయిందని నిర్దారించుకున్న

అనంతరం నిందితుడు బోపన్న వీర్రాజుపేట పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. బోపన్న, శిల్పా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కొడగు ఎస్పీ కె. రామరాజన్‌ మీడియాకు సమాచారం అందించారు.

వివాహం చేసుకున్న తరువాత బోపన్న, శిల్పా దంపతులు చాలా సంతోషంగా గడిపారని, ఇద్దరు కుమార్తెలు పుట్టిన తరువాత కూడా ా దంపతులు చాలా సంతోషంగా ఉండేవారని తెలిసింది. తరువాత మొదలైన చిన్నచిన్న గొడవలు కారణంగా దంపతులు ఒకే ఇంటిలో ఉన్నా వంట గదులు మాత్రం రెండు అయ్యాయని, ఎవరికి కావలసి వంట వాళ్లు చేసుకుని తింటున్నారని శిల్పా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు ఎప్పటిలాగే మొదలైన చిన్న గొడవ చివరికి శిల్పా ప్రాణం తీసిందని ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+