Surgical Strike: రెండోసారి సర్జికల్ స్ట్రైక్..! క్లారిటీ ఇచ్చిన రక్షణ శాఖ..
భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ చేయలేదని స్పష్టం చేసింది. మంగళవారం రోజు జమ్మూకాశ్మీర్ లోని బాలాకోట్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇదే అదునుగా భావించిన ఇద్దరు ఉగ్రవాదులు భారత్ లోకి చోరబడేందుకు ప్రయత్నం చేశారు.
భారత్ లోకి ప్రవేస్తున్న ఉగ్రవాదులను సైన్యం గుర్తించింది. వెంటనే అడ్డుకుంది. ఇది సర్జకల్ స్ట్రైక్ కాదని రక్షణ శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరింది. సర్జికల్ స్ట్రైక్ జరగలేదని ఆర్మీ కూడా స్పష్టం చేసింది. కాగా పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లో మరోసారి భారత్ సైన్యం సర్జికల్ స్ట్రేక్ చేసిందని ఓ వార్తా ప్రత్రిక ప్రచురించింది. భారత ఆర్మీ శనివారం రాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి 2.5 కిలోమీటర్లు చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు పేర్కొంది.

సర్జికల్ స్ట్రైక్ లో పాకిస్థాన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు లాంచింగ్ పాడ్‌లను ధ్వంసం చేసినట్లు పత్రికలో ప్రచురించారు. ఈ దాడిలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. భారత ఆర్మీ 2016 సెప్టెంబర్ 28, 29 మధ్య రాత్రి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి.
ఉరీ దాడిగా పేరొందిన ఈ దాడి ఉరీ పట్టణంలోని ఆర్మీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగింది. 19 మంది భారతీయ సైనికుల ప్రాణాలను బలిగొన్న ఉరీ దాడి జరిగిన పదకొండు రోజుల తర్వాత, జమ్మూ మరియు కాశ్మీర్‌లో మోహరించిన వివిధ విభాగాలకు చెందిన కమాండోలతో సహా భారత సైన్యం మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని టెర్రర్ లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేయడానికి నియంత్రణ రేఖ మీదుగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది.












Click it and Unblock the Notifications