Diamond Ganesh:ఆ వ‌జ్ర‌పు గ‌ణ‌ప‌య్య విలువ‌.. వంద‌ల కోట్లు

దేశ‌వ్యాప్తంగా గ‌ణేష్ మండ‌పాలు విద్యుత్ వెలుగుల‌తో మెరిసిపోతున్నాయి. ఆ ఉండ్రాళ్ల గ‌ణ‌ప‌య్య వివిధ ఆకృతుల్లో ద‌ర్శ‌న‌మిస్తూ భ‌క్తులను క‌నువిందు చేస్తున్నాడు. అయితే, సూర‌త్‌కు చెందిన వ‌జ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా అంద‌రి చూపూ త‌న వ‌ద్ద ఉన్న‌ వినాయ‌కునివైపు తిప్పుకునేలా చేశాడు. వంద‌ల కోట్ల రూపాయ‌లు విలువ చేసే డైమండ్ బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ప్ర‌పంచానికి మ‌రోసారి ప‌రిచ‌యం చేశాడు. సైజులో ఇది కోహినూర్ కంటే పెద్దగా ఉండటం విశేషం. దీంతో ఖ‌రీధైన బొజ్జ‌గ‌ణ‌ప‌య్య ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఈ విగ్ర‌హం 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువుతో మిరుమెట్లుగొలుపుతోంది. ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తున్నారు. ఆ ఒక్కరోజే ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించి, సాధార‌ణ‌ భక్తులకు కూడా దీన్ని ద‌ర్శించుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఈ వజ్రం ధర గురించి కనుభాయ్ వెల్లడించకపోయినా.. మార్కెట్​లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ డైమండ్ గణపతి ఫొటోలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, యోగా గురువు రామ్​దేవ్ బాబా వంటి ప్రముఖులకు అందించారు కనుభాయ్.

The Lord Ganesh-Shaped Diamond Owned by a Surat Businessman: Unveiling Its Staggering Cost

అలా మ‌న దేశానికి వ‌చ్చింది : నిజానికి, ఈ డైమండ్ విగ్ర‌హం ఈనాటి కాదు. సూర‌త్‌లో వ‌జ్రాల వ్యాపారం చేస్తోన్న‌ కనుభాయ్ 15 ఏళ్ల క్రితం బిజినెస్ ప‌నిమీద‌ బెల్జియం వెళ్లారు. అలా అక్క‌డి నుంచి కొన్ని ముడి వజ్రాలను వ్యాపార నిమిత్తం భారత్‌కు తీసుకొచ్చారు. అయితే, అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు కనుభాయ్ తండ్రికి కల వచ్చింద‌ని క‌నుబాయ్ కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఆ త‌ర్వాత ఆ వజ్రాన్ని గమనించామ‌ని, నిజంగానే వాటిలో ఒక‌ వినాయకుడి ఆకారం కనిపించిందని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అలా అప్పటి నుంచి ఈ డైమండ్ గ‌ణ‌ప‌య్య‌ను కనుభాయ్ కుటుంబం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజలు చేస్తూ వ‌స్తోంది. అంతేకాదు, ఈ వజ్ర‌పు ప్ర‌తిమ‌ను పూర్తిగా ప్రకృతిసిద్ధంగా ఏర్పడింద‌ని, అందుకే తాను వ్యాప‌ర దృష్టితో దీనిని ఎప్ప‌టికీ చూడ‌న‌ని, చివ‌రి వ‌ర‌కూ త‌న కుటుంబంతోనే ఈ డైమండ్ ఉంటుంద‌ని కనుభాయ్ చెబుతున్నారు. అత్యంత ప్రత్యేక ఆకారంలో ఉన్న వజ్రంగా దీనికి గిన్నిస్ రికార్డు సైతం లభించింది.

ప‌సుపు బూడిద రంగులో ధ‌గ‌ధ‌గ‌లు : కనుభాయ్ అసోదరియా వ‌ద్ద ఉన్న ఈ అరుదైన డైమండ్ గ‌ణ‌ప‌తి ఆకృతి ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఈ పసుపు బూడిద రంగు వజ్రం దాదాపు 48 మిల్లీమీట‌ర్ల‌ ఎత్తు, 32 మిల్లీమీట‌ర్ల‌ వెడల్పు మరియు 20మిల్లీమీట‌ర్ల‌ మందంతో మెరిసిపోతూ ఉంటుంది. దీని బరువు 36.50 గ్రాములు. అంతేకాదు, ఈ గణేశ విగ్రహం ఏడాదిలో ఎక్కడ ఉందనేది కూడా అత్యంత రహస్యంగానే ఉంచుతారు. ఎందుకంటే ఇది గణేశుడి ఆకారంలో ఉన్న సహజసిద్ధమైన వజ్రం, దీని విలువ కోట్లలో ఉంటుంది మ‌రి.

దీని దర్శనం కోరుకునే భక్తులు కానూభాయ్ కార్యాలయానికి ముందుగానే కాల్ చేయాల్సి ఉంటుంది. చివరి క్షణంలో వేదికను వెల్లడించేటప్పుడు సమయం మరియు తేదీని తెలియ‌జేస్తారు. అయితే, కాల్ చేసిన వారంద‌రికీ దీని ద‌ర్శ‌న‌భాగ్యం దొర‌క‌దు. ప‌రిమితి సంఖ్య‌లోనే భ‌క్త‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు. వంద‌ల కోట్ల విలువైన వ‌జ్ర‌పు గ‌ణ‌ప‌య్య‌ను ద‌ర్శించుకునే అదృష్టం అంద‌రికీ ల‌భించ‌దు క‌దా.. మీరేమంటారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+