ఫోన్ లో ప్రియుడి తో మాట్లాడటం ఇబ్బంది అని బిడ్డను ఏం చేసిందంటే ?, ఇలాంటి తల్లి ?
చిన్ని పిల్లలు ఏడుస్తుంటే వారికి జోలపాడటం, కథలు చెప్పడం చేస్తారు. లేదంటే పిల్లలు ఎడుపు ఆపడానికి వాళ్లు ఇష్టంగా తినే ఆహారం తినిపిస్తుంటారు. పిల్లలు ఏడుస్తుంటే తండ్రి కంటే తల్లి ఎక్కువ తల్లడిల్లిపోతుంది. బిడ్డను అక్కున చేర్చుకుని తల్లి తల్లడిపోయే సంఘటనలు మనం చాలాసార్తు చూస్తుంటాము. అయితే ఫోన్ లో ప్రియుడితో మాట్లాడుతున్న సమయంలో బిడ్డ ఏడుస్తున్నాడని ఆ బిడ్డను కన్న తల్లి చంపేసింది.
జార్ఖండ్ లోని గిరిధార్ లోని బెంగాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అఫ్సానా ఖుతూన్ అలియాస్ అఫ్సానా అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న అఫ్సానా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. అఫ్సానాకు రెండు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నారు. అఫ్సానా, అన్సారి దంపతులతో పాటు ఆమె అత్త రోజానా అన్సారి కూడా వారితోనే నివాసం ఉంటున్నది.

అఫ్సానా కొంతకాలంగా నిత్యం ఫోన్ లో వేరే వ్యక్తులతో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటుందని తెలిసింది. ఫొన్ కు అంకితం అయిపోన తరువాత అఫ్సానా ఎవ్వరినీ పట్టించుకోదని, ఆమె మొబైల్ ఫోన్, అవతలివైపు మాట్లాడుతున్న వారే ప్రపంచం అనుకుంటుందని ఆమె అత్త రోజానా అన్సారి అంటోంది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో అఫ్సానా ఆమె కుమారుడు ఒక గదిలో ఉన్నారు.
ఆ సందర్బంలో అఫ్సానాకు ఆమె ప్రియుడి నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆమె ఫోన్ లో మాట్లాడుతోంది. ఆ సందర్బంలో అఫ్సానా కొడుకు ఏడవడం మొదలుపెట్టాడు. బిడ్డ ఏడుస్తున్నాడని కూడా పట్టించుకోని అఫ్సానా ఆమె పాటికి ఆమె ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నది. అయితే బిడ్డ మాత్రం ఏంతసేపటికి ఏడుపు నిలపకపోవడంతో ఫోన్ లో ప్రియుడితో మాట్లాడటం వీలుకాలేదని సహనం కోల్పోయిన అఫ్సానా వెంటనే బిడ్డ దగ్గరకు వెళ్లి కన్న కొడుకు గొంతు గట్టిగా నులిమేసింది.
ఒక్కసారిగా గొంతు నులిమేయడంతో బిడ్డ బెడ్ మీద కుప్పకూలిపోవడంతో అబ్బాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే తన బిడ్డ నిద్రలోనే చనిపోయాడని అఫ్సానా కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది. అయితే అఫ్సానా మీద ఆమె అత్త రోజానా అన్సారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం పోస్టుమార్టం నివేదిక వచ్చింది.

బిడ్డకు గొంతు నులిమివేయడంతో అతని ప్రాణం పోయిందని పోస్టుమార్టం నివేదిక వచ్చింది. పోలీసుల విచారణలో బిడ్డను తానే హత్య చేశానని అఫ్సానా అంగీకరించింది. ఫోన్ లో మాట్లాడటం ఇబ్బందిగా ఉందని కోపంతో కన్నబిడ్డను తల్లి హత్య చెయ్యడం కలకలం రేపింది. అఫ్సానాకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, నిత్యం అతనితోనే ఆమె ఎక్కువగా మాట్లాడుతుంటుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications