BJP List: బీజేపీ మొదటి జాబితాలో అక్షయ్ కుమార్, కంగనా..!
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మంత్రులు దేశంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. 100 నుంచి 110 మందితో మొదటి జాబితా ప్రకటించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి జాబితాలో యువకులు, కొత్త వ్యక్తులకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో సెలబ్రెటీలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ కు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. ఫస్ట్ లిస్ట్ లో వీరి పేరు ఉండే అకాశం ఉందని జాతీయ మీడియాలో కథనలు వస్తున్నాయి. ఢిల్లీలోని చాందిని చౌక్ నుంచి అక్షయ్ కుమార్ బరిలో దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కంగనా రనౌత్ ను హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కంగనా రనౌత్ ఈ మధ్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన టైమ్ అని చెప్పారు. దీంతో ఆమెకు బీజేపీ టికెట్ ఖాయంగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. వీలైనంత త్వరగా మొదటి జాబితా విడుదల చేయాలని ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో 6 నుంచి ఎనిమిది మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి భరత్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేర్లు మొదటి జాబితాలో ఉండే అవకాశం ఉందని తెలిస్తోంది. ఇక మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, మురళీధర్ రావు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications