వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమర్షియల్ గ్యాస్ ధర తగ్గింపు - కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా : అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కొంత కాలం క్రితం వరకూ పెరగుతూ వచ్చిన వంట గ్యాస్ ధరల అంశంలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అక్టోబర్ నుంచి ఎల్పీజీ ధరలు తగ్గలేదు. పెట్రో ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టే కొద్ది సమయం ముందు ఆయిల్ కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లుగా ప్రకటించాయి. 2024 ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో వంట గ్యాస్ ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని కొద్ది రోజులు అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే విధంగా కమర్షియల్ సిలిండర్ ల విషయంలో నూ మార్పులు ఉండే అవకాశం ఉందని భావించారు. ఈ సమయంలో కేంద్రం వంట గ్యాస్ ధరలను పెంచలేదు. కాగా, ఆయిన్ కంపెనీలు ధరలు తగ్గిస్తూ ప్రకటన చేసాయి. క్రూడ్‌ ఆయిల్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో ఆకాశాన్ని అంటున్న తరుణంలో ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారింది. ఫిబ్రవరి 1న ఢిల్లీలో 14.2 కేజీల ఇండేన్‌ డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 899.50 గా ఉంది. అలాగే కోల్‌కతాలో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 926రూ. ఉంది. ముంబైలో నాన్‌ సబ్సిడైజ్డ్‌ ఎల్పీజీ సిలిండర్‌ రూ. 899.50 గా, చెన్నైలో రూ. 915.50గా ఉంది. ఇవాళ మరికొన్ని రాష్ట్రాల్లోనూ కంపెనీలు సిలిండర్‌ల ధరలు భారీగా తగ్గించాయి.

The national oil marketing companies have reduced the cost of commercial 19-kg LPG cylinders by Rs 91.5

హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. నాలుగు నెలలుగా ఇదే ధర కొనసాగుతోంది. కమర్షియల్ ధర దాదాపుగా రూ.91.50పై. తగ్గింది. ఇది ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. పెట్రో ఉత్పత్తుల ధరల అంశంలో పూర్తిగా నియంత్రాణాధికారం కేంద్రం అయిల్ కంపెనీలకే అప్పగించింది. అయితే, దీపావళి వేళ కేంద్రం పెట్రో ఉత్పత్తుల పైన పన్నుల శాతాన్ని తగ్గించి..ధరలను తగ్గించే నిర్ణయం తీసుకుంది. కాగా, పలు రాష్ట్రాలు సైతం తమ పరిధిలోని పన్నుల శాతాన్ని తగ్గించాయి. ఇక, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న వేళ..ఈ నిర్ణయం ఉపశమనంగా కనిపిస్తోంది. అదే విధంగా డొమెస్టిక్ ధరల పైన త్వరలో నిర్ణయం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

English summary
The national oil marketing companies have reduced the cost of commercial 19-kilogram LPG cylinders by Rs 91.5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X