చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

owner: టీస్టాల్ ఓనర్ ను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు, ఏం జరిగింది ?, మనోడు ఏం చేశాడు ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: కేంద్ర హోమ్ శాఖ కన్నెర్ర చెయ్యడంతో నిషేధానికి గురైన పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నాయకులు, కార్యకర్తలు చాపకిందనీరులా వారి కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది పీఎఫ్ఐ నాయకులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఎవరు ఎక్కడ తలదాచుకున్నా వారిని బయటకు లాగాలని ఎన్ఐఏ అధికారులు సిద్దం అయ్యారు. టీస్టాల్ మీద దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు ఆ టీస్టాల్ యజమానిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఎన్ఐఏ అధికారులు ఏంది, టీస్టాల్ యజమానిని అరెస్టు చెయ్యడం ఏంది అని ప్రజలు జోరుగా చర్చ మొదలుపెట్టారు. తరువాత అందరికి అసలు మ్యాటర్ తెలిసింది.

Wife: రెండో భార్యతో రొమాన్స్, అర్దరాత్రి మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా ?Wife: రెండో భార్యతో రొమాన్స్, అర్దరాత్రి మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా ?

టీస్టాల్ మీద దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు

టీస్టాల్ మీద దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు

ఇలాంటి సమయంలో పీఎఫ్ఐకి చెందిన ఓ టాప్ లీడర్ ను టీస్టాల్ లో ఎన్ఐఏ అధికారులు పట్టుకుని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

తమిళనాడులోని పళనిలో నివాసం ఉంటున్న మోహమ్మద్ ఖైజర్ అలియాస్ మోహమ్మద్ (50) అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మోహమ్మద్ ఖైజర్ పళనిలో ఓ టీ దుకాణం నడుపుతున్నాడు.

పేరుకు టీస్టాల్ ఓనర్.... లోపల ?

పేరుకు టీస్టాల్ ఓనర్.... లోపల ?

టీ దుకాణంతో డబ్బులు సంపాధిస్తున్న మోహమ్మద్ ఖైజర్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించినా అతను మధురై జోన్ పీఎఫ్ఐ చైర్మన్‌గా పని చేస్తున్నాడని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. మ్యాటర్ తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు తమిళనాడులోని పళని చేరుకున్నారు. పళనిలోని గాంధీ రోడ్‌లోని టీ దుకాణంలో వ్యాపారం చేసుకుంటూ సైలెంట్ గా ఉన్న మోహమ్మద్ ఖైజర్ ను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు అతన్ని పళని సిటీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

మనోడు మదురై జోన్ ఇన్ చార్జ్

మనోడు మదురై జోన్ ఇన్ చార్జ్

పళని పోలీస్ స్టేషన్ లో మోహమ్మద్ ఖైజర్ ను ఎన్ఐఏ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఢిల్లీ నుంచి వెళ్లిన ఐదు మంది ఎన్ఐ అధికారుల బృందం మోహమ్మద్ ఖైజర్ ను విచారిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించిన తరువాత అ పార్టీ నాయకులు చాక్యచక్యంగా సీక్రేట్ గా వారి కార్యకలపాలు నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది.

కారు పేలుడు, కుక్కర్ బాంబు ఎఫెక్ట్ తో ?

కారు పేలుడు, కుక్కర్ బాంబు ఎఫెక్ట్ తో ?

కోయంబత్తూరు సిలిండర్ పేలుళ్లు, కర్ణాటకలోని కుక్కర్ బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కర్ణాటక, తమిళనాడు, కేరళలలో అనేక మంది పీఎఫ్ఐ కార్యకర్తలను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు పళనికి చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మదురై రీజినల్ నాయకుడు మోహమ్మద్ ఖైజర్ ను అదుపులోకి తీసుకుని విచారించడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది. మోహమ్మద్ ఖైజర్ ఇంకా ఎంత మంది గురించి సమాచారం బయట పెడుతాడో వేచి చూడాలని అక్కడి పోలీసులు అంటున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పీఎఫ్ఐ కార్యకలాపాలు చాలా సీక్రేట్ గా సాగుతున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అధికారులు అన్ని ఆలోచించి, వెనుకా ముందు సమాచారం సేకరించి ఒక్కోసారి ఒక్క ప్రాంతంలో దాడులు చేసి పీఎఫ్ఐ నాయకులు, లీడర్స్ కు సినిమా చూపిస్తున్నారని సమాచారం.

English summary
The NIA officers who arrested the owner of the tea stall in Palani in Tamil Nadu. People were shocked to know the real matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X