Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగ్రవాదుల లక్షం పురాతన దేవాలయం, జస్ట్ మిస్ అయ్యింది, ఎన్ఐఏ, ఆలీ దెబ్బతో !

బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు నగరంలోని నాగురి ప్రాంతంలోని గరోడి సమీపంలో ఆటోరిక్షాలో పేలిపోయిన కుక్కర్ బాంబు పేలుడు నిందితుల లక్ష్యం అదే మంగళూరు నగరంలోని అతిపురాతన దేవాలయమైన శ్రీ కద్రీ దేవాలయం అని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది.

2022 నవంబర్ 19వ తేదీన మంగళూరు నగరంలోని నాగురిలోని గరోడి సమీపంలో వేగంగా వెలుతున్న ఆటో లో కుక్కర్ బాంబు పేలిపోయింది. పాడిల్‌లో ఆటో వెలులుతున్న అనుమానిత ఉగ్రవాది షరీక్ వద్ద ఉన్న కుక్కర్ బాంబు ప్రమాదవశాత్తు నాగూరి సమీపంలో పేలింది. షరీక్ తో పాటు ఆటో డ్రైవర్ పురుషోత్తమ పూజారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

The NIA said that the target of the Mangaluru cooker bomb accused was the ancient Kadri temple.

ఈ ఇద్దరిని కంకనాడి ఫాదర్ ముల్లర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ కోలుకుని ఇంటికి తిరిగి రాగా, షరీక్‌ను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తును అప్పటి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. అయితే షరీక్‌ కుక్కర్‌ బాంబు పేలుడు లక్ష్యం ఏమిటో చాలాకాలం తెలియరాలేదు.

ఇప్పుడు తొలిసారిగా ఎన్ఐఏ ప్రకటనలో ఉగ్రవాది షరీక్ కుక్కర్ బాంబు పేలుడు లక్ష్యం కద్రీ పుణ్యక్షేత్రమేనని వెలుగు చూసింది. కుక్కర్ బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరాఫత్ అలీని రెండు రోజుల క్రితం ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. మంగళూరు గ్రాఫిటీ, కుక్కర్ బాంబు పేలుళ్ల సూత్రధారి ఆరాఫత్ అని అరెస్టు తరువాత వెలుగు చూసింది.

The NIA said that the target of the Mangaluru cooker bomb accused was the ancient Kadri temple.

అనుమానిత ఉగ్రవాది షరీక్ మంగళూరులోని కద్రీ ఆలయంలో బాంబు పేల్చడానికి ప్లాన్ చేశాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఎన్ఐఏ అధికారుల విచారణలో ఇంకా ఎలాంటి షాకింగ్ సమాచారం బయటకు వస్తుందో అంటూ మంగళూరు ప్రజలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+