4 నెలలు, 430 హత్యలు, 198 రేప్ లు, క్రైమ్ రేట్ లో ఏ రాష్ట్రం కింగ్ అంటే ?, గ్రేట్ సీఎం అంటూ ఫైర్ !
కర్ణాటకలో రానురాను హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2024 జనవరి నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు అంటే కేవలం నాలుగు నెలల్లో దాదాపు 430 హత్యలు, 198 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ మాఫియా, సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2024లో హత్యలు, అత్యాచారాలు, మహిళలు మరియు పిల్లలపై లైంగిక హింస, సైబర్ నేరాలు మరియు ఇతర నేరాలు భారీగా పెరిగాయి. ఇవే కాకుండా, డ్రగ్స్ కేసులు కూడా నిరంతరం పెరుగుతున్నాయి, సైబర్ మోసం కేసులు పరిమితికి మించి ఉన్నాయి. దాడుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సిద్దరామయ్య సీఎం అయిన తరువాత కర్ణాటకలో గూండా రాజ్యం మొదలైయ్యిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం 2024 జనవరి నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలో 430 హత్య కేసులు, 198 అత్యాచారం, 2, 327 మహిళలపై హింస కేసులు నమోదయ్యాయి. 1,262 చిన్నారులపై లైంగిక వేధింపులు (పోక్సో) కేసులు, 6, 063 దాడి కేసులు, 1, 144 డ్రగ్స్ కేసులు, 7, 421 సైబర్ క్రైమ్, 2, 243 చీటింగ్ కేసులు, 450 దోపిడీ, 68 డకాయిట్ కేసులు నమోదయ్యాయని క్రైమ్ రికార్డుల ను బట్టి న్యూస్ వెలుగులోకి వచ్చింది.
నివేదిక ప్రకారం గతేడాది 1, 295 హత్యలు జరిగాయి. 609 అత్యాచార కేసులు, 17,439 దాడులు, 3, 856 పోక్సో కేసులు, 6, 946 లైంగిక వేధింపుల కేసులు, 6, 764 డ్రగ్ కేసులు, 21, 895 సైబర్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే గత నాలుగు నెలల్లోనే కర్ణాటకలో ఇంత క్రైమ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆ రాష్ట్రంలోని సిద్దరామయ్య ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దం అయ్యింది.

బీజేపీ-జేడీఎస్‌ల మెరుపు దాడి
కర్ణాటక రాష్ట్రంలో కేవలం 4 నెలలకే క్రిమినల్ కేసు ఇంత పెద్ద మొత్తంలో నమోదు కావడం శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి అద్దం పడుతోందని జేడీఎస్ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, రోడ్లపై హత్యలు జరుగుతున్నాయని, రాష్ట్రమే రేపిస్టుల అడ్డాగా మారిందని, బెంగళూరు నగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందని, ఇదంతా కేవలం 4 నెలల్లోనే జరిగింది అని, దీనిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్‌ను జేడీఎస్ సూటిగా అడిగింది. రాష్ట్ర హోం శాఖ పని చేస్తుందా లేక నిద్రపోతోందా? అని జేడీఎస్ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, గూండాయిజం, ఉగ్రవాదం అనే హామీలను అడ్డంకులు లేకుండా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ కూడా ట్వీట్ చేసింది. దీంతో గత 4 నెలల్లో 430 హత్యలు జరిగాయి. ఇప్పటికీ దోపిడీ, అత్యాచారం, పోక్సో, అల్లర్లు మొదలైన వాటి క్రైమ్ రేట్ లెక్కలు భిన్నంగా ఉంది. సిద్ధరామయ్య ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అల్లర్లు సృష్టించింది. హనుమ జెండా కేసులు, హిందువులపై కేసులు, హిందువుల అరెస్ట్, రామనగర్ న్యాయవాదుల కేసుల్లో ప్రభుత్వం చేతులు కలిపిందని బీజేపీ ఆరోపించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications