Garlic Price: భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. అదే దారిలో ఉల్లి..!
గత సంవత్సరం వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. అవి తగ్గుముఖం పట్టే సమయంలో ఈ సంవత్సరం టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.200 చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. టమాటా ధరలు తగ్గుముఖం పట్టగానే.. అల్లం, వెల్లుల్లి ధరలు పెరిగాయి. వాటి ధర కాస్త తగ్గిందో లేదో అప్పుడే ఉల్లి ధరలు పెరిగాయి. ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఉల్లి ఎగుమతిని నిషేధించింది.
తాజాగా మళ్లి వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. అల్లం వెల్లుల్లిని దాదాపు ప్రతి కర్రీలో వేసుకుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ లో తప్పకుండా వేసుకోవాల్సిందే. చికెన్, మటన్, పిష్ కర్రీలో అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా వేసుకోవాలి. లేకుంటే ఆ కర్రీ అంతగా రుచి ఉండదు. కానీ ప్రస్తుతం వెల్లుల్లి ధరలు కొండెక్కయాని చెప్పొచ్చు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి100 రూపాయలు పలికింది.

ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లోనే కిలో రూ.300 నుంచి రూ.400 చేరింది. రిటైల్ మార్కెట్లో మాత్రం 350 రూపాయలు నుంచి రూ.400 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు వెల్లుల్లి కొనలేని పరిస్థితిలో ఉన్నారు. వెల్లుల్లి ధరలు పెరగడంతో మళ్లీ ఆహార ద్రవ్యోల్బణమం పెరిగే అవకాశం ఉంది. వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్లో నిల్వలు తగ్గుతుండడం వల్లే ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల నుంచి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటున్నారు. మరో మూడు నెలల దాకా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. వారం రోజుల క్రితం వచ్చిన తుఫాన్ తో భారీగా పంట నష్టం జరిగినట్లు అధికారుల చెబుతున్నారు. హైదరాబాద్ కు తెలంగాణలోని కోహిర్ నుంచే కాకుండా రాజస్తాన్, మహారాష్ట్ర నుంచి కూడా వెల్లుల్లి వస్తుందని పేర్కొన్నారు.
నెల రోజుల క్రితం మార్కెట్ కు రోజుకు 30 నుంచి 50 లారీల వెల్లుల్లి దిగుమతి కాగా.. ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే వస్తున్నదని హైదరాబాద్ మార్కెట్ కమిటీ అధికారి చెబుతున్నారు. అందుకే ధరలు పెరిగినట్లు వివరిస్తున్నారు. అటు ఉల్లి కూడా రిటైల్ మార్కెట్ కిలో రూ. 60 నుంచి రూ.70 పలుకుతోంది. అటు కోడి గుడ్డు ధరలు కూడా భారీగా పెరిగాయి. కోడి గుడ్డు ఒక్కొటి రూ. 6.50 నుంచి రూ.7 పలుకుతోంది.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications