వెంకయ్యను పిలుచుకురండి: రూ. 10 లక్షలు ఇస్తాం

బెంగళూరు: కర్ణాటక నుంచి రాజ్యసభ్యకు వెళ్లిన కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, లిక్కర్ కింగ్ విజయ్ మల్యాను పిలుచుకువస్తే రూ. 10 లక్షలు బహుమానం ఇస్తామని వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటల్ నాగరాజ్ అన్నారు.

The rally reached Freedom Park in Bengaluru

వీరిద్దరి వలన కర్ణాటకకు ఎలాంటి ఉపయోగం లేదని, కన్నడిగుల సమస్యలను వీరు పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి అయిన ఎం. వెంకయ్య నాయుడు కళసా-బండూరి తాగు నీటి ప్రాజెక్టు నిర్మించే విషయంలో స్పందించడం లేదని విమర్శించారు.

The rally reached Freedom Park in Bengaluru

కర్ణాటక బంద్ సందర్బంగా బెంగళూరు నగరంలోని ఫ్రీడం పార్క్ లో ఎర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో వాటల్ నాగరాజ్ మాట్లాడారు. వెంకయ్య నాయుడు, విజయ్ మల్యా లాంటి వారిని రాజ్యసభకు పంపించిన కన్నడిగులు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు.

The rally reached Freedom Park in Bengaluru

ఒక్క సారైనా వీరు రాజ్యసభలో కన్నడిగుల సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. తమిళనాడు, గోవా ప్రభుత్వాల తీరును వీరు ఎందుకు ప్రశ్నించడంలేదని అన్నారు. ఇకనైనా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కన్నడిగుల గురించి పట్టించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలు కన్నడ సంఘాల నాయకులు మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+