Squawk codes:స్క్వాక్ కోడ్‌తో ఎయిరిండియా విమానంసేఫ్ ల్యాండింగ్..ఈ కోడ్ ఏంటి..?
Squawk code:బుధవారం రోజు ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఎమెర్జెన్సీ డిక్లేర్ అయిన విషయం తెలిసిందే. మరో గంటలో లండన్ హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కోరుతూ పైలట్ స్క్వాకింగ్ చేశారు. ఈ క్రమంలోనే స్క్వాక్ కోడ్ (squawk code) అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ స్క్వాక్ కోడ్ అంటే ఏంటి..? ఇది ఎప్పుడు ఎలా ఎందుకు ఉపయోగిస్తారు..?
బుధవారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం AIC 129 నుంచి స్క్వాకింగ్ 7700 అనే ఎమర్జెన్సీ సిగ్నల్ వెలువడింది. ఈ సమాచారం ఫ్లయిట్ రాడార్ సైట్‌పై కనిపించడంతో సర్వత్రా ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఈ స్క్వాక్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్క్వాక్ కోడ్ అనేది ఒక నాలుగు అంకెలు కలిగిన సంఖ్య. ఈ సంఖ్య ప్రతి విమానంకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కేటాయిస్తుంది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్‌పాండర్ ద్వారా సంకేతాలు పంపుతుంది. స్క్వాక్ కోడ్‌ను ట్రాన్స్‌పాండర్ కోడ్ అని కూడా పిలుస్తారు. ఒక్కో కోడ్‌కు ఒక్కో అర్థం ఉంటుంది.

ఒక విమానం గతి తప్పినప్పుడు లేదా గ్రౌండ్‌తో సంకేతాలు సంబంధాలు తెగిపోయినప్పుడు లేదా ఇతర సమస్యలు తలెత్తినప్పుడు ఈ స్క్వాక్ కోడ్ ద్వారా విమానం ఎక్కడుందో రేడార్ స్క్రీన్స్ పై ట్రాక్ చేస్తారు. ఇదంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ లేదా ఏరోడ్రోమ్‌ల నుంచి జరుగుతుంది. ప్రతి విమానంకు ఒక ప్రత్యేక స్క్వాక్ కోడ్‌ను కేటాయిస్తారు. రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పైలట్‌తో సంభాషణలు జరిపి ఆ విమానం ఎక్కడుందో ట్రాక్ చేస్తారు. ఒక విమానంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే అందులోని పైలట్ స్క్వాక్ కోడ్‌ను యాక్టివేట్ చేస్తారు.రేడియో తరంగాల ద్వారా స్క్వాక్ కోడ్ ట్రాన్స్‌మిట్ అవుతుంది. ట్రాన్స్‌మిట్ అయిన ఈ కోడ్‌ను రాడార్ వ్యవస్థ అందిపుచ్చుకుంటుంది.ఈ ప్రక్రియ పూర్తవగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు విమానం ఎక్కడుందో రేడార్ డిస్ప్లే పై ట్రాక్ అవుతుంది.
స్క్వాక్ కోడ్‌ను ఎప్పుడు అమలు చేశారు..
తప్పిపోయిన విమానంను రేడార్ పై కనుగొనేందుకు స్క్వాక్ కోడ్‌ను తొలిసారిగా 1940లో ప్రవేశపెట్టారు. తొలుత ఈ కోడ్‌లు కేవలం రెండంకెల సంఖ్యగానే ఉండేది. ప్రతి విమానంకు ఈ కోడ్‌ను కేటాయించేవారు.కాలక్రమంలో విమానాల సంఖ్య పెరిగిపోవడంతో రెండంకెల సంఖ్యను కాస్త నాలుగు అంకెలుగా చేశారు.తొలినాళ్లలో ఏటీసీ ఒక స్క్వాక్ కోడ్ పైలట్లకు ఇచ్చి ఆ విమానంలోని ట్రాన్స్‌పాండర్‌లో ఎంటర్ చేయాల్సిందిగా కోరేవారు.అయితే ఈ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటుండటం, అదే సమయంలో తప్పలు దొర్లడంతో ఇది సురక్షితం కాదని భావించి, ఆటోమేటెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ వ్యవస్థే ట్రాన్స్‌పాండర్‌లోకి స్క్వాక్ కోడ్‌ను ఎంటర్ చేస్తుంది. ఫ్లయిట్ ప్లాన్, ఇతర అంశాలన పరిగణలోకి తీసుకుని స్క్వాక్ కోడ్‌ను ఏటీసీ కేటాయించేది.
సాధారణ ఏవియేషన్ రంగంలో ఇప్పటికీ పైలట్లే ట్రాన్స్‌పాండర్‌లో స్క్వాక్ కోడ్‌ను ఎంటర్ చేస్తున్నారు. ఈ రోజు ఏటీసీలో స్క్వాక్ కోడ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలో స్క్వాక్ కోడ్‌లు ఇచ్చే సమాచారం ఏటీసీకి ఎంతో ఉపయుక్తంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో స్క్వాక్ కోడ్ కీలక భూమిక పోషిస్తుంది. ఒక విమానం ఎక్కడుందో ట్రాక్ చేస్తుంది.ముఖ్యంగా ఎక్కువ రద్దీగా ఉన్న ఎయిర్ స్పేస్‌లో స్క్వాక్ కోడ్ ఏటీసీకి బాగా ఉపయోగపడుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయిట్ ప్లాన్, వెళుతున్న మార్గంపై ఏటీసీకి స్క్వాక్ కోడ్ కచ్చితమైన సమాచారం ఇస్తుంది.దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడదు అదే సమయంలో విమానాలు ఢీ కొనకుండా నివారిస్తాయి.
ఇక ఎమెర్జెన్సీ లేదా అత్యవసర పరిస్థితుల్లో కూడా స్క్వాక్ కోడ్‌లు ఉపయోగపడతాయి.ఒక వేళ ఏదైనా విమానంలో సమస్య లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే ఆ విమానంకు కేటాయించిన స్క్వాక్ కోడ్‌ను పైలట్ ట్రాన్స్‌మిట్ చేస్తారు. ఇది ఏటీసీని అలర్ట్ చేస్తుంది.దీంతో ప్రమాదంలో ఉన్న విమానానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ముంబై నుంచి లండన్ వెళ్లే విమానం కూడా స్క్వాక్ కోడ్ వినియోగించి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications