sex scandal: మాజీ ఎంపీ మాటలు విని షాక్ అయిన సిట్ అధికారులు

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి ప్రజ్వల్ రేవణ్ణను భారీ పోలీసు బందోబస్తు మధ్య హాసన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. ఈ సమయంలో మాజీ ఎంపీ ప్రజ్వల్ పోలీసు అధికారులకు ఓ మనవి చేశారు.

అయితే పోలీసు అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ మాటలు విని షాక్ అయ్యారు. తాను మీడియాతో మాట్లాడటానికి ఓ అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

The SIT officials interrogated Prajwal Revanna at his home

మీడియాతో మాట్లాడేందుకు నిమిషం సమయం ఇవ్వాలని మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోని ఆయన నివాసం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిమాండ్‌పై సిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిందితులను ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందుకు రాకూడదని సిట్ అధికారులు అన్నారు
. నేనేమీ తప్పు చేయలేదని, నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని మీడియా ముందు మాట్లాడేందుకు ప్రయత్నించిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణను బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించారు. అత్యాచారం జరిగిన సంఘటనా స్థలంలో విచారణ చెయ్యడానికి ప్రజ్వల్ రేవణ్ణను జైలు నుంచి హాసన్ లోని ఆయన ఇంటి దగ్గరకు పిలుచుకుని వెళ్లారు.

ఘటనా స్థలానికి పోలీసులు ప్రజ్వల్ ను పోలీసు ఎస్కార్ట్‌తో తీసుకెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగింది.

హాసన్ లోని ఆర్ సీ రోడ్డులోని మాజీ ఎంపీ ప్రజ్వల్ నివాసంలో సిట్ అధికారులు విచారణ నిర్వహించారు. మాజీ ఎంపీ ప్రజ్వల్ నివాసంలో నాపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 4 గంటలపాటు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఆయన ఇంటిలో విచారణ చేసి వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంలో సిట్ అధికారులతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం కూడా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చిన సిట్ బృందం సాయంత్రం నాలుగు గంటలకే వివరాలు నమోదు చేసుకుని తరువాత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరుకు పిలుచుకుని వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+