బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: పరీక్షలకు, హిజాబ్ కు లింక్ పెట్టిన లాయర్లు, సున్నితమైన సమస్యను పెద్దది చేస్తున్నారా ?, సుప్రీం కోర్టు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: హిజాబ్ కు పరీక్షలకు లింక్ పెట్టాలని అనుకున్న కొందరికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ముస్లీం అమ్మాయిలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

ఇటీవల హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంట్లోనే ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. గత బుధవారం సుప్రీం కోర్టులో ముస్లీం అమ్మాయిలకు ఎదురుదెబ్బ తగిలింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని ఇటీవల సుప్రీం కోర్టు చెప్పింది.

హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ ను వెంటనే విచారణ చెయ్యాలని మరోసారి ముస్లీం అమ్మాయిల తరుపున న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పరీక్షలకు సమయం దగ్గరపడుతోందని, వెంటనే హిజాబ్ పిటిషన్ విచారణ చెయ్యాలని చెప్పారు. మీరు పరీక్షలకు, హిజాబ్ కు ఎందుకు లింక్ పెడుతున్నారు, సున్నితమైన విషయాన్ని మీరు పెద్దది చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారా ? అంటూ సుప్రీం కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్లు వెంటనే విచారణ చెయ్యడం సాధ్యం కాదని, పిటిషన్ల విచారణకు డేట్ చెప్పలేమని సుప్రీం కోర్టు గురువారం చెప్పింది.

Illegal affair: రెండో భార్యకు మూడో ప్రియుడు. అర్దరాత్రి రెండో భర్త ఏం చేశాడంటే ?, కొడవలితో కట్ చేసి!Illegal affair: రెండో భార్యకు మూడో ప్రియుడు. అర్దరాత్రి రెండో భర్త ఏం చేశాడంటే ?, కొడవలితో కట్ చేసి!

హిజాబ్ వేసుకుంటాము

హిజాబ్ వేసుకుంటాము

ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

సుమారు 12 రోజుల పాటు హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు జరిగాయి. మార్చి 15వ తేదీ ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

అదే రోజు ఏం చేశారంటే?

అదే రోజు ఏం చేశారంటే?

కర్ణాటక హైకోర్టు తీర్పుతో మేము షాక్ అయ్యామని, మాకు న్యాయం జరగలేదు అనిపిస్తోందని కొందరు ముస్లీం అమ్మాయిలు అన్నారు. మార్చి 15వ తేదీ ఉడిపిలో ముస్లీం అమ్మాయిలు ఆల్మాస్, ఆలియా ఆసాది తదితరులు మీడియాలో మాట్లాడారు.

మేము మా లాయర్లతో చర్చించి హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని ఆల్మాస్, ఆలియా ఆసాది తదితరులు మీడియాకు చెప్పారు. మీడియాతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

లాయర్ల మనవి

లాయర్ల మనవి

కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్ ను గత బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ వెంటనే విచారణ చెయ్యాలని అడగుతున్నారని, అత్యవసరంగా విచారణ చెయ్యాల్సిన అవసరం ఏముందని సుప్రీం కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ వెంటనే విచారణ చెయ్యాలని పిటీషనర్ల తరుపు న్యాయవాది సంజయ్ హెడ్డే సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

పరీక్షలకు హిజాబ్ కు లింక్ పెట్టిన లాయర్లు

పరీక్షలకు హిజాబ్ కు లింక్ పెట్టిన లాయర్లు

గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ బెంచ్ ముందుకు హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్లు విచారణకు వచ్చాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయని, మా క్లైంట్లు పరీక్షలు రాయడానికి హిజాబ్ లు వేసుకుని వెళ్లాలని. అందుకే ఈ పిటిసన్ వెంటనే విచారణ చెయ్యాలని ముస్లీం అమ్మాయిల తరపున వాదనలు వినిపించిన దేవదత్ కామత్ సుప్రీం కోర్టులో మనవి చేశారు.

సంవత్సరం వృధా అవుతోందని వాదన

సంవత్సరం వృధా అవుతోందని వాదన

మీరు హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటీషన్లు వెంటనే విచారణ చెయ్యకుంటే మా క్లైంట్ లు పరీక్షలు రాయలేరని, అలా జరిగితే సంవత్సరం పాటు వారు చదివిన చదువు వృధా అవుతోందని ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. మా క్లైంట్లు హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వాలని న్యాయవాది దేవదత్ కామత్ సుప్రీం కోర్టులో మనవి చేశారు.

సున్నితమైన విషయం పెద్దది చేస్తున్నారా?

సున్నితమైన విషయం పెద్దది చేస్తున్నారా?

ముస్లీం అమ్మాయిల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మీరు పరీక్షలకు, హిజాబ్ కు ఎందుకు లింక్ పెడుతున్నారు, సున్నితమైన విషయాన్ని మీరు పెద్దది చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారా ? అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పిటిషనర్లను ప్రశ్నించారు.

డేట్ ఫిక్స్ చెయ్యలేము

డేట్ ఫిక్స్ చెయ్యలేము

హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్లు వెంటనే విచారణ చెయ్యడం సాధ్యం కాదని, అందుకు కచ్చితమై తేదీని ఇప్పుడే నిర్ణయించడం కుదరదని, త్వరలోనే ఓ రోజు హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్లు విచారణ చేస్తామని సుప్రీం కోర్టు గురువారం చెప్పింది. హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులను చంపేస్తామని బెదిరించిన నిందితులను ఇప్పటికే తమిళనాడులో అరెస్టు చేసి వారిని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Hijab: The Supreme Court Thursday refused to give a specific date for the hearing challenging the Karnataka HC order upholding the ban on wearing hijab in educational institutions in the state. To the appellants who contented that exams were due and they were being prevented from entering school, Chief Justice of India N V Ramana said, this has nothing to do with exams…don’t sensitise the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X