అన్నేళ్ల తర్వాత అంటే కుదరదు.. కారుణ్య నియామకాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
కారుణ్య నియామాకాలపై సుప్రీం కోర్టు సంచల తీర్పును వెలువరించింది. ప్రభుత్వ విభాగాలలో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందడం అనే నిబంధన ఏమీ లేదని, అతి ముమ్మాటికీ హక్కుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. నిజానికి, విధినిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి హఠాత్మరణం చెందితే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే రూల్ లేదని తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పలు కారుణ్య నియామకాలను ఈ తీర్పు ప్రశ్నార్థకంలోకి నెట్టినట్లయింది. ఈ మేరకు రెండున్నర దశాబ్దాల క్రితం సర్వీసులో ఉండగా మరణించిన ఉన్న ఓ కానిస్టేబుల్ కుటుంబం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఉద్యోగం వస్తుందని భావించి..
ఈ పిటిషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. హరియాణాకు చెందిన టింకూ అనే పిటిషనర్ తండ్రి జైప్రకాశ్ 1997లో సర్వీసులో ఉండగా మృతి చెందారు. అయితే, ఆ సమయానికి కుమారుడు టింకూకు ఏడేళ్లు కాగా, మృతుని భార్య నిరక్షరాస్యురాలు. ఈ కారణంగా ఆమె కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయకుండా, తన కుమారుడి పేరును మైనర్ల జాబితాలో చేర్చాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. అలా టింకూ మేజర్ అయిన తర్వాత కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం వస్తుందని భావించారు. వారి అభ్యర్థన మేరకు 1998లో టింకూ పేరును అప్పటి హరియాణా డీజీపీ రికార్డులలో నమోదు చేశారు. అలా 2008లో అంటే, జైప్రకాశ్ మరణించిన 11 ఏళ్లకు అతని కుమారుడు టింకూ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు.

ఆ తీర్పులను సమర్థిస్తూ..
ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. కారుణ్యనియామకానికి ఉద్యోగి మరణించిన మూడేళ్లలోపు దరఖాస్తు చేసుకోవాలంటూ 1999లో వచ్చిన నిబంధన మేరకు అధికారులు టింకూ అభ్యర్థనను పక్కనపెట్టారు. అయితే, అధికారుల నిర్ణయాన్ని తప్పుబడుతూ తనకు న్యాయం చేయాలని టింకుకు కింది కోర్టులను ఆశ్రయించారు. అయితే, వాటితో సహా పంజాబ్-హరియాణా హైకోర్టులోనూ టింకూకు చుక్కెదురైంది. దీంతో ఆ కుటుంబ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. పిటిషనర్ పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పులను సమర్థించింది. అమల్లో ఉన్న విధానానికి, చట్టానికి వ్యతిరేకంగా, ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించలేదంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్‌సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
కాస్త ఊరట కలిగేలా..
కారుణ్య నియామకం ప్రభుత్వోద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందులకు గురికారాదనే ఉద్దేశంతో ఉన్నదే తప్ప సుదీర్ఘ కాలం తర్వాతా పొందే హక్కు కాదని తీర్పులో తెలిపింది.టింకూ తల్లికి ఏకమొత్తంలో పరిహారం కోరుతూ సంబంధిత అధికార విభాగానికి విజ్ఞప్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆమె అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు మించితే అందుకు వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications