కూతురితో కలిసి భర్తను చంపించిన ఆంటీ, ప్రియుడితో స్కెచ్ వేసిన కూతురు, వెంటాడి వేటాడి, ఫినిష్ !
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కులినంజయ్యన్ గ్రామంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఉపాధ్యాయుడు మరియప్ప (47) హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. టీచర్ మరియప్ప ఆయన కూతురి ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తండ్రిని చంపేందుకు తల్లీ, కూతురు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
కూతురి ప్రేమను అంగీకరించని తండ్రిని అమ్మతో కలిసి కూతురు హత్య చేయడం దురదృష్టకరం అని పోలీసులు అంటున్నారు. నాలుగు రోజుల క్రితం శుక్రవారం ఫిబ్రవరి 9వ తేదీన మోడూరు పాఠశాలలో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్న మారియప్ప (47)ను తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకాలోని పొలం సమీపంలో దారుణంగా నరికి చంపేశారు. ఉపాధ్యాయుడు మరియప్పను ఎవరిపైనా పగతో హత్య చేసి ఉంటారని మొదట పోలీసులు అనుమానించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల విచారణ ప్రతి దశలోనూ ఉత్కంఠ రేపింది. చివరకు హత్యకు గురైన గెస్ట్ టీచర్ మరియప్పను అతని భార్య శోభా, కూతురు హేమలత కలిసి మరియప్పను చంపేందుకు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి షాక్‌కు గురైన పోలీసులు తల్లీకూతురితో పాటు హత్య కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడు మరియప్ప అతని భార్య శోభా, కూతురు హేమలతతో కలిసి పేదరికంలో ఉన్నా చాలా హాయిగా జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఎదిగిన కూతురు హేమలత అదే గ్రామానికి చెందిన శాంతకుమార్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమకు తల్లి శోభా అంగీకరించినా తండ్రి మారియప్ప మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో కూతురిని ప్రేమించిన యువకుడు శాంతకుమార్ ను ఉపాధ్యాయుడు మారియప్ప కొట్టాడు. దీంతో మారియప్పపై అతని కుమార్తె హేమలతా బాయ్ ఫ్రెండ్ శాంతకుమార్ కు ద్వేషం పెరిగింది. ప్రియురాలు తండ్రి మరియప్ప మీద ప్రతీకారం తీర్చుకునేందుకు శాంతకుమార్ సిద్దం అయ్యాడు.బెంగళూరులో నివాసం ఉంటున్న తన స్నేహితులతో కలిసి మారియప్పను హత్య చేయాలని శాంతకుమార్ పథకం పన్నాడు.
అలాగే అరకొర జీతంతో నిరుపేద జీవితం గడుపుతున్న టీచర్ మారియప్ప కూతురు హేమలత, భార్య శోభా కూడా మరియప్ప హత్యకు పథకం పన్నిన శాంత కుమార్ కు సహకరించాలని అతనితో చేతులు కలిపారు. బెంగళూరులో నివసిస్తున్న స్నేహితులు సంతు, హేమంత్‌లను కలిసిన శాంతకుమార్ అతని గర్ల్ ఫ్రెండ్ హేమలతా తండ్రి మరియప్ప హత్యకు సుఫారీ ఇచ్చాడు.

మరియప్ప కదలికలపై తల్లీకూతుళ్లు కలిసి శాంతకుమార్ కు సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయుడు మారియప్ప హత్య జరిగిన రోజు అతడి కదలికలపై తల్లీకూతుళ్లు సుపారీ కిల్లర్‌లకు సమాచారం అందించారు. అమావాస్య పూజలు ముగించుకుని మరియప్ప సొంత గ్రామానికి తిరిగి వస్తున్నట్లు అతని భార్య శోభా, కూతురు హేమలతా కలిసి శాంతకుమార్‌కు సమాచారం అందించారు.
గ్రామం సమీపంలోకి వస్తుండగా బైక్‌ను అడ్డగించిన నిందితులు మరియప్ప ముఖంపై కారం పెప్పర్ స్ప్రే చల్లారు. భయాందోళనకు గురైన మారియప్ప బైక్ దిగి పారిపోయాడు. అయితే టీచర్ మరియప్పను వెంబడించిన నిందితులు అతన్ని పొలాల్లో వెంటాడి వెంటాడి నరికి చంపేశారు. కుణిగల్ పోలీసులు శాంతకుమార్, సంతు, హేమంత్, శోభా, హేమలతను అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే హత్య జరిగిన రోజు హేమలత తెలివిగా తన తండ్రి మరియప్ప హత్యపై విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. అయితే హేమలత ప్రేమ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేయగా టీచర్ హత్య కేసు బయటపడింది. ఇప్పుడు టీచర్ హత్య కేసులో అతని భార్య శోభా, కూతురు హేమలతాతో ాపటు అందరూ జైలుపాలైనారు.












Click it and Unblock the Notifications