ఎందుకు పుట్టారో తెలీదు, భారత్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ జిందాబాద్, పబ్ లో పోయేకాలం !
భారత్, పాకిస్థాన్ దేశాల మద్య దశాభ్దాలుగా గొడవలు, పంచాయితీలు ఉన్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు భారత్ లో చొరబడి వాళ్లు చేస్తున్న అరాచకాలు ఇంతాఅంతాకాదు. పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ మార్గం నుండి భారత్ లోకి చొడరబడుతున్న పాక్ ఉగ్రవాదులు దేశ సరిహద్దులో ఉన్న భారత సైనికులను పోట్టనపెట్టుకుంటున్నారు. ప్రతిదాడుల్లో ఉగ్రవాదులు అంతం అవుతున్నా పాక్ ఉగ్రవాదుల ఆగడాలకు అంతం లేకుండా పోతావుంది.
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో సైనికులు, ఉగ్రవాదుల మధ్య నిత్యం టెన్షన్ ఉన్న విషయం తెలిసిందే. ఇక భారత్- పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు దేశాల ప్రజలు వెయ్యికళ్లతో ఆ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అంటూ వేచి చూస్తారు. భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ దేశాల్లో క్రికెట్ అభిమానులు ఆరోజు పండుగే అని చెప్పవచ్చు. పాక్ తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత్ ఆటగాళ్లు ఉత్సాహంగా ఆడుతారు.

భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా భారత్ లో పాక్ కు మద్దతుగా చాలాసార్లు నినాదాలు చేసిన విషయం తెలిసిందే. భారత్ లో పుట్టిపెరిగి ఇక్కడే ఉంటున్న చాలా మంది పాకిస్థాన్ గెలవాలని చాలా సందర్బాల్లో బహిరంగంగా నినాదాలు చెయ్యడంతో వాళ్లను గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. అయితే పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేని విషయంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ సందర్బంగా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ జిందాబాద్, భారత్ క్రికెట్ టీమ్ ఓడిపోవాలి అంటూ బహిరంగంగా నినాదాలు చేశారు.
ఆదివారం భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య టీ 20 క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య టీ 20 క్రికెట్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. బెంగళూరు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు టీవీల ముందు కర్చుని భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగిన టీ 20 క్రికెట్ మ్యాచ్ చూశారు. పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం సేవిస్తూ క్రికెట్ మ్యాచ్ చూశారు.
బెంగళూరులోని జేపీ నగర్ 1వ స్టేజ్ లోని ఓ పబ్ లో మద్యం సేవిస్తున్న ఇనాయత్ ఉల్లాఖాన్, సయ్యద్ ముబారక్ అనే ఇద్దరు యువకులు భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఆ సందర్బంలో భారత్ ఓడిపోవాలని ఇనాయత్ ఉల్లాఖాన్, సయ్యద్ ముబారక్ పబ్ లో గట్టిగా కేకలు వేశారు. అంతే కాకుండా భారత్ డౌన్ డౌన్, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పబ్ లో గట్టిగా నినాదాలు చేశారు.
ఆ సందర్బంలో పబ్ లో మద్యం సేవిస్తూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కొందరు పాకిస్థాన్ కు జిందాబాద్ అని చెప్పకూడాదని, అలా చెప్పాలనుకుంటే బయటకు వెళ్లిపోవాలని ఇనాయత్ ఉల్లాఖాన్, సయ్యద్ ముబారక్ లకు సూచించారు. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఇనాయత్ ఉల్లాఖాన్, సయ్యద్ ముబారక్ పదేపదే పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పబ్ లో క్రికెట్ మ్యాచ్ చేస్తున్న సాటి కస్టమర్లు, పబ్ యాజమాన్యం జేపీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి నిందితులు ఇనాయత్ ఉల్లాఖాన్, సయ్యద్ ముబారక్ ను విచారించారు. మద్యం మత్తులో తాము నాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేశామని నిందితులు అద్దరూ అంగీకరించారు. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, శత్రుదేశానికి మద్దతుగా నినాదాలు చేశారని ఆరోపిస్తూ ఇనాయత్ ఉల్లాఖాన్, సయ్యద్ ముబారక్ లను అరెస్టు చేసిన జేపీ నగర్ పోలీసులు నిందితలు మీద కేసు నమోదు చేసి ప్రత్యక్షసాక్షల దగ్గర వివరాలు తెలుసుకుని కేసు విచారణ చేస్తున్నారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications