బుల్లెట్ లో స్పీడ్ గా వెళ్లి రివాల్వర్ తో నానా హంగామా చేస్దే ? వీడియో వైరల్ !
బెంగళూరు/హాసన్: సోషల్ మీడియాలో స్టార్‌గా ఎదిగేందుకు ఇప్పటి యువతి, యువకులకు మోజు ఎక్కువ అయ్యింది. రకరకాలుగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం మామూలు అయిపోయింది. ఇద్దరు ముస్లిం యువకులు బుల్లెట్ బైక్‌పై జాలీగా తిరుగుతూ రివాల్వర్ పైకి చూపిస్తూ హల్ చల్ చేస్తూ వెలుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఇద్దరు ముస్లిం యువకులు తుపాకీ పట్టుకుని బైక్ పై ప్రయాణిస్తూ పోజులిచ్చి ఇతరులను భయపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. బైక్ రైడర్ వేగంగా బుల్లెట్ నడుపుతుండగా వెనుక కుర్చున్న వ్యక్తి తుపాకీ పట్టుకుని రకరకాలుగా పోజులు ఇస్తూ ఎదురుగా వచ్చిన వారిని కాల్చిచంపినట్లు బెదిరిస్తూ వెళ్లాడు. దీంతో స్థానికులు, ఇతర ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఆ ఇద్దరు ముస్లీం యువకులను బూతులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు.

అయితే మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతుంది అనే సామెతలాగా రివాల్వర్ చూపుతూ అందరిని బెదిరించిన వ్యక్తులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్‌గౌడ్ అనుచరులు హాసన్ సిట్టింగ్ ఎమ్మెల్యే స్వరూప్ ప్రకాష్ మీద మండిపడ్డారు. అయ్యా మీ ఓటర్లకు మీరు బుద్ధి చెప్పండి. వీలింగ్ హంగామా చేస్తున్న వారిలో తుపాకులు పట్టుకుని ప్రజలను బెదిరిస్తున్న యువకులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారికి తక్షణమే గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు అంటూ ఎమ్మెల్యేకి మనవి చేశారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ఉదయం సంబరాలు చేసుకుని సాయంత్రం హసన్ పట్టణ శివార్లకు వచ్చిన యువకులు బైక్‌పై వెళ్లారు. ఈసారి సోషల్ మీడియా రీళ్ల కోసం తుపాకీ తీసుకొచ్చారు. KA 13- EK 5679 నంబర్ గల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను నడుపుతూ తుపాకీతో నానా హంగామా చేశారని వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, పబ్లిక్ పోస్ట్‌ను ట్యాగ్ చేసి వెంటనే నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు ప్రజలు మనవి చేశారు.

సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేసిన ముస్లిం యువకుల తుపాకీతో హింసను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ముస్లిం యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఒక బుల్లెట్ బైక్ మరియు ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు, అయితే తుపాకీని పరిశీలించగా అది నకిలీ అని తేలిందని పోలీసులు అన్నారు. బైక్ రైడర్ వెనుక నకిలీ తుపాకీ పట్టుకుని బైక్‌పై రీల్స్ చేయడానికి వెళ్లి ఆందోళనకు దిగినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హరిరామ్ శంకర్ ఆదేశాల మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి బైక్, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications