షాక్: జైల్లో శశికళకు ప్రాణహాని: అదనపు బలగాలతో భద్రత, ఎందుకంటే ?

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ప్రాణహాని ఉందని వెలుగు చూడటంతో జైళ్ల శాఖ అధికారులు ఆమెకు అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. శశికళ ఉంటున్న గది (సెల్) దగ్గర అదనపు పోలీసు బలగాలతో భద్రత కల్పిస్తున్నారు.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మహిళా ఖైదీలు ఉంటున్న మొదటి అంతస్తులోని శశికళ గది దగ్గర గురువారం మద్యాహ్నం నుంచి 10 మంది అదనపు మహిళా పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. శశికళ ప్రాణాలకు ఎలాంటిహాని ఎదురుకాకుండా చూస్తున్నామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

There is tight security around the cell in which Sasikala is lodged.

శశికళ మీద దాడి జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయని తెలిసింది. అందువలన ముందు జాగ్రత్త చర్యగా శశికళకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని సమాచారం. పరప్పన అగ్రహార జైల్లో ఉన్న తమిళనాడుకు చెందిన ఖైదీల నుంచి శశికళ మీద దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చారని తెలిసింది.

గతంలో జయలలిత పరప్పన అగ్రహార జైలుకు వచ్చిన సమయంలో ఇలాంటి భద్రత కల్పించారు. జయలలితకు జడ్ ప్లస్ భద్రత ఉన్న కారణంగా అధికారులు అప్పట్లో జైల్లో కూడా ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. శశికళకు మాత్రం జడ్ ప్లస్ భద్రత లేదు. జైల్లో ప్రయివేటు సెక్యూరిటీని అనుమతించపోవడంతో అదనపు మహిళా పోలీసు బలగాలతో భధ్రత కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+