యుపి సిఎం పీఠం: ఆ ఆరు జిల్లాలే కీలకం, ఎందుకు?
ఉత్తరప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు అవధ్ రీజియన్ లోని ఆరు జిల్లాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు అవధ్ రీజియన్ లోని ఆరు జిల్లాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవధ్ రీజియన్‌లోని లక్నో, సీతాపూర్, ఉన్నావో, హర్దోయి, రాయబరేలీ, బారాబంకీ జిల్లాలు ఉన్నాయి.
1996 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరు జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ మాత్రమే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టింది.
ఆ పార్టీ నేతే సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధ్య భాగంలోని ఈ జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న వారిదే విజయం. వివరాలు పరిశీలిద్దాం

1996లో బీఎస్పీ ఇలా
1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ 33, బీఎస్పీ 67 స్థానాలను గెలుచుకున్నాయి. త్రిశంకు సభ ఏర్పడింది. అవధ్ రీజియన్ లో 38 స్థానాలకు గాను కాంగ్రెస్ - బీఎస్పీ కూటమి కేవలం 12 సీట్లు మాత్రమే గెలుచుకున్నది. కానీ కొన్ని నెలల తర్వాత బీజేపీతో కలిసి బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆరు జిల్లాల పరిధిలోని 38 స్థానాల్లో బీజేపీ, బీఎస్పీ 18 స్థానాల్లో విజయం సాధించాయి.

2002లో బీఎస్పీ - బీజేపీ సంకీర్ణం
2002 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశంకు సభ ఏర్పడింది. సమాజ్ వాదీ పార్టీ 143 స్థానాల్లో గెలుపొంది..అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అవధ్ రీజియన్ లో 38 స్థానాలకు 14 నియోజకవర్గాల్లో ఎస్పీ గెలుపొందింది. ఈ సారి కూడా బీఎస్పీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండు పార్టీలకు కలిపి 186 స్థానాలు వచ్చాయి. ఈ ఆరు జిల్లాల పరిధిలో ఈ రెండు పార్టీలకు 21 స్థానాలు వచ్చాయి.

సొంత మెజారిటీతో మాయావతి ఇలా..
2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రీజియన్‌లో 15 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ తొలిసారి క్షేత్రస్థాయిలో బలాన్ని కోల్పోయి 12 స్థానాలకు పరిమితమైంది. దళితులు, ముస్లింలు, బ్రాహ్మణుల మధ్య ఐక్యతను ప్రతిపాదిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఘటన విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి యూపీలో మాయావతి సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు.

దేశంలో అతి పిన్న వయస్సులో సీఎంగా అఖిలేశ్
2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అవధ్ రీజియన్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. 38 స్థానాలకు 29 స్థానాల్లో విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 స్థానాలకు 224 స్థానాలు ఎస్పీ ఖాతాలో చేరాయి. ఈ రీజియన్ లో బీఎస్పీ కేవలం ఐదు స్థానాలకు పరిమితమైంది.












Click it and Unblock the Notifications