కాశీలో నా మరణం కోసం వారు ప్రార్ధనలు చేశారు: ఎస్పీ, కాంగ్రెస్ లపై ప్రధాని మోడీ ఆరోపణలు

ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఆయన మృతికి ప్రత్యర్థులు ప్రార్థనలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. భారత రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎంత దిగజారిపోయారో తాము చూశామని పేర్కొన్నారు. కాశీలో, వారు తన మరణం కోసం ప్రార్థించినప్పుడు, తాను బాధ పడలేదని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో వెల్లడించారు. దీని అర్థం నా మరణం వరకు నేను కాశీని విడిచిపెట్టను లేదా కాశీ ప్రజలు నన్ను విడిచిపెట్టరు అని తాను భావిస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గతంలో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన మోడీ

గతంలో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన మోడీ


గత ఏడాది వారణాసిలో తన అనేక అధికారిక కార్యక్రమాలపై ప్రధానిని ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ప్రధాని మోడీ నెల రోజుల పాటు జరుపుకున్న వేడుకల నివేదికల గురించి అడిగిన ప్రశ్నకు, అఖిలేష్ యాదవ్ వారు కేవలం ఒక నెల మాత్రమే కాదు, రెండు లేదా మూడు నెలలు కూడా అక్కడ ఉండగలరు. అది బస చేయడానికి వారికి సరైన ప్రదేశం. వారి చివరి రోజులను బనారస్ (వారణాసి)లో గడుపుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాశీ అని పిలువబడే బనారస్‌లో ఒకరి చివరి రోజులు గడపడం శుభప్రదమని హిందువుల విశ్వాసానికి సూచన. అయితే అప్పుడే ఈ వ్యాఖ్యను బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఇక తాజా ఎన్నికల ప్రచారంలో మోడీ ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు.

సమాజ్వాదీ పార్టీ పై విరుచుకుపడిన మోడీ

సమాజ్వాదీ పార్టీ పై విరుచుకుపడిన మోడీ


వారణాసిలో బిజెపి బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఉగ్రవాదులు ఎటువంటి భయం లేకుండా పనిచేశారని ఆరోపించారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరించాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో హర్దోయ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకోవాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.

 కాంగ్రెస్ పైనా మోడీ మండిపాటు

కాంగ్రెస్ పైనా మోడీ మండిపాటు

సమాజ్‌వాదీ పార్టీ మరియు కాంగ్రెస్ నాయకుల వైఖరి మరింత ఆందోళనకరంగా ఉందని పేర్కొన్న ప్రధాని మోడీ ఈ వ్యక్తులు ఒసామా వంటి ఉగ్రవాదిని 'జీ' అని సంబోధిస్తున్నారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల నిర్మూలనపై ఈ వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు అని మోడీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

 చివరి దశ పోలింగ్ లో వారణాసి..

చివరి దశ పోలింగ్ లో వారణాసి..

2014 నుండి ప్రధానమంత్రి యొక్క లోక్‌సభ నియోజకవర్గం, వారణాసి అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో మార్చి 7న పోలింగ్ జరుగుతుంది. పార్లమెంటరీ స్థానం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి మరియు రోహనియా. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్ (సోనేలాల్) ఒక సీటును, మిగిలిన 4 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి పార్లమెంటరీ పరిధిలోని అన్ని స్థానాలను కైవశం చేసుకోవటానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+