వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ జాబితాతో బట్టబయలు.. అందుకే బీజేపీ ఆ విషయం దాచిందన్న రాహుల్ గాంధీ..

|
Google Oneindia TeluguNews

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి 50 మందితో కూడిన జాబితాను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ జాబితాలో బీజేపీ సన్నిహితులే ఎక్కువగా ఉన్నారని.. అందుకే పార్లమెంటులో ఆ వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు.

'పార్లమెంటులో నేనో సాధారణ ప్రశ్న అడిగాను. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టిన 50 మంది డిఫాల్టర్ల పేర్లు వెల్లడించాలని కోరాను. కానీ ఆర్థికమంత్రి అందుకు సమాధానమిచ్చేందుకు తిరస్కరించారు. కానీ ఇప్పుడు నీరవ్ మోదీ,మెహుల్ చోక్సీ సహా ఇతర బీజేపీ సన్నిహిత నేతల పేర్లను ఆర్బీఐ జాబితాలో పెట్టింది. రుణ ఎగవేతదారులంతా తమ సన్నిహితులేనన్న విషయం ఎక్కడ బయటపడుతుందోననే బీజేపీ ఆ పేర్లను పార్లమెంటులో వెల్లడించలేదు.' అని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

This Is Why Truth Was Hidden Rahul Gandhi On RBIs Defaulters List

సమాచార హక్కు చట్టం(RTI) కింద సాకేత్ గోఖలే అనే కార్యకర్త పిటిషన్‌తో ఆర్బీఐ 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను అందజేసింది. దీంతో బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇదో అస్త్రంగా మారినట్టయింది. నీరవ్ మోదీ,మెహుల్ చోక్సీ,విజయ్ మాల్యా వంటి 50 మంది రుణ ఎగవేతదారులకు సంబంధించి రూ.68607కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని ఆరోపించింది. వీరి రుణాలను ఎందుకు మాఫీ చేసిందో చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ మోసపూరిత విధానాలను ఇది స్పష్టం చేస్తోందన్నారు.

Recommended Video

Chiranjeevi And Tollywood Actors Donates Blood, Requesting People to Donate Blood

English summary
Congress leader Rahul Gandhi on Tuesday cornered the government after the Reserve Bank of India (RBI) released a list of top 50 wilful defaulters accused of cheating Indian banks, saying that the BJP had "hidden" the list from parliament because it included friends of the ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X