మొగుడు వద్దు: బెడ్ రూంలో కుక్కలతో లేడి టెక్కి

బెంగళూరు: కుక్కలపై పెంచుకున్న విపరీతమైన ప్రేమ కారణంగా ఒక యువజంట సంసారంలో చిచ్చు రేగింది.మొగుడినైనా వదిలేస్తా కాని నా కుక్కలను మాత్రం విడిచి పెట్టనని ఆమె తేల్చి చెప్పింది. ఆమెకు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. తమ వల్ల కాదంటు చేతులు ఎత్తేశారు

బెంగళూరు నగరంలోని హెచ్ ఎస్ఆర్ లేఔట్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న అరుణ్ (30), కేరళలలోని కొచ్చికి చెందిన రమ్యా (26)ల (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) వివాహం 2014 జనవరిలో జరిగింది. రమ్యా కూడ సాఫ్ట్ వేర్ ఇంజనీరే.

ఇరు కుటుంబాల పెద్దలు ఎంతో వైభవంగా వీరి వివాహం జరిపించారు. నవ దంపతులు బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో నివాసం ఉంటున్నారు. అయితే రమ్యా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు తనతో పాటు లాబ్రడార్ జాతికి చెందిన రెండు పెంపుడు కుక్కలను అత్తారింటికి తీసుకువచ్చింది.

ఇంటిలో మొగుడి కంటే కుక్కలకు రమ్యా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. చివరికి భర్తను దూరంగా పెట్టి బెడ్ రూంలో సైతం తన పక్కనే రెండు కుక్కలను పడుకొపెట్టింది. భర్త వస్తే కుక్కలను మధ్యలో పెట్టుకుని నిద్రపోయేది.

This marriage has gone to the dogs in Bengaluru

రమ్యా రోజు రోజుకు మాట వినకుండా కుక్కలతోనే ఎక్కువ సమయం గడిపింది. వాటిని పిలుచుకుని పార్కులలో షికారుకు వెళ్లింది. అరుణ్ చాల సార్లు భార్య మీద మండిపడ్డాడు. అయినా ఆమె లెక్కచెయ్యలేదు.

అరుణ్ తల్లి చాలసార్లు అతనికి నచ్చ చెప్పింది. చివరికి రమ్య ఎంతకి మాట వినకపోవడంతో అరుణ్ కుటుంబ సభ్యులు హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సమస్య కావడంతో పోలీసులు దంపతులను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలోని కౌన్సిలింగ్ కేంద్రానికి పంపించారు.

అక్కడి అధికారులు రమ్యాకు ఎంత నచ్చచెప్పినా ఆమె మాట వినలేదు. తనకు మొగుడి కంటే కుక్కలు ముఖ్యమంటూ తేల్చి చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. మరో సారి దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

కుటుంబ పెద్దలు చెప్పినా రమ్యా తన నిర్ణయం మార్చుకోలేదు. అయితే దంపతులు ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి న్యాయవాదులతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ వింత కేసు చూసి పోలీసులు ముక్కున వేలు వేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+