యూజర్ల డేటా దొంగతనం: యూసీ బ్రౌజర్‌పై నిషేధానికి కేంద్రం రెఢీ?

భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది.

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది. ఈ తరుణంలో యూసీ బ్రౌజర్ వినియోగదారుల డేటాను సేకరిస్తోందనే సమాచారంపై కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది.

డేటా దొంగతనానికి పాల్పడుతున్నారంటూ చైనా కంపెనీలపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

 This ‘most popular’ smartphone browser in India may be banned

ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి వెబ్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాదికారి ఒకరు తెలిపారు.

యూసీ బ్రౌజర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి తెలిపారు. చైనాలోని సర్వర్లకు భారత్ యూజర్ల మొబైల్ డేటాను పంపిస్తోందని.....ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నామని ఆ అధికారి తెలిపారు.

యూసీ బ్రౌజర్‌కు భారత్‌లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్లకు పైనే ఉన్నాయి. గ్లోబల్‌గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్‌లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ .

యూసీ బ్రౌజర్ మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్‌లో మార్కెట్ షేరు 48.7 శాతమైతే యూసీ వెబ్ సెక్యూరిటీని ప్రైవసీని చాలా సీరియస్‌గా పరిగణణలోకి తీసుకొంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.

యూజర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటు చేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్దతని చెప్పారు.తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేయడం లేదన్నారు.

యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకొంటుంది.యూజర్ల సమాచారాన్ని డేటాను సేకరించడం ఇండస్ట్రీ పద్దతిలో భాగమంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడుతామని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+