వద్దు.. 4ముక్కలు చేస్తాం: పాక్‌కు స్వామి హెచ్చరిక

న్యూఢిల్లీ: ఈసారి పాకిస్తాన్ భారత దేశం పైన యుద్దానికి దిగితే తాము నాలుగు ముక్కలు చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారని తెలుస్తోంది. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో మాట్లాడారు.

పాకిస్తాన్ ఒత్తిడిలో ఉందని, ఆది చాలా బలహీనమైనదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం యూజ్ లెస్ అన్నారు. అదో డమ్మీ ప్రభుత్వం అని విమర్శించారు. పాకిస్తాన్ మిలటరీ భారత దేశంతో యుద్ధం కోరుకుంటే.. మేం (భారత్) సిద్ధమన్నారు. అయితే, భారత్ మాత్రం యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు.

This time we will break Pakistan into 4 pieces, says Subramanian Swamy

భారత్ ఎప్పుడు కూడా ఎవరితోను యుద్ధం కోరుకోదని చెప్పారు. అయితే, యుద్ధం అనివార్యమైతే మాత్రం తప్పకుండా బుద్ధి చెబుతామన్నారు.

ఓ హిందీ డెయిలీలో వచ్చిన కథనం ప్రకారం... పాకిస్తాన్ పైన భారత్ ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రకటించదని, భారత్ యుద్ధాన్ని కోరుకోదని చెప్పారు. పాకిస్తాన్ మిలిటరీ కోరుకుంటే మాత్రం మేం సిద్ధమని చెప్పారు.

ఇప్పటికే పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశామని, మరోసారి భారత్‌తో యుద్ధానికి దిగితే పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేస్తామని హెచ్చరించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+