వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా రాష్ట్రానికి రావద్దు: హర్యానా మంత్రి సంచలన వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

చండీఘడ్: బీఫ్‌పై హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినేవారు తమ రాష్ట్రానికి రావద్దని ఆయన హెచ్చరించారు. తమ రాష్ట్రంలో గోసంరక్షణ చట్టం కట్టుదిట్టంగా అమలవుతోందని ఆయన చెప్పారు.

ఆహారం, పానీయపు అలవాట్లు సరిపడని కొన్ని దేశాలకు మనం వెళ్లబోమని, అలాగే బీఫ్ తినకుండా ఉండలేమని భావించేవారు హర్యానాకు రాకుండా ఉంటే మంచిదని ఆయన అన్నారు. బీఫ్ తినే విదేశీయులకు ప్రత్యేక అనుమతి ఇస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆయన ఆ విధంగా స్పందించారు.

Those Who Can't Live Without Beef Must Not Visit Haryana: Anil Vij

అయితే, బీఫ్ తినే విదేశీయులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంతకు ముందు ప్రకటించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనిల్ విజ్‌కు కొత్తేమీ కాదు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దీనిపై ఆన్‌లైన్ పోల్ నిర్వహించాలని ఆయన నిరుడు డిమాండ్ చేశారు.

గోసంరక్షణ, గోవధ నిషేథం బిల్లును నిరుడు మార్చిలో గోవా అసెంబ్లీ ఆమోదించింది. గత నవంబర్‌లో ఈ బిల్లు అమలులోకి రాడంతో ఆవుల అక్రమ రవాణా, గోవధ, బీఫ్ తినడంపై నిషేధం కొనసాగుతోంది. గోవధకు పాల్పడినవారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఆ బిల్లులో పొందుపరిచారు.

English summary
Haryana's Health Minister Anil Vij has said that those who cannot live without eating beef should not visit the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X