ఢిల్లీలో షాకింగ్: వర్దమాన నటిపై గ్యాంగ్ రేప్, ముగ్గురి అరెస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ వర్ధమాన నటి, మోడల్ సామూహిక అత్యాచారానికి గురైంది.ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసరు. 23 ఏళ్ల ఆమె పలు టీవీ సీరియళ్లలో కూడా నటించింది.

బిహార్‌కు చెందిన బాధితురాలు మోడలింగ్‌ కోసం ఢిల్లీకి వచ్చి నివాసం ఉంటోంది ఈ క్రమంలో పలు సీరియళ్లలో చిన్నపాటి పాత్రలు పోషిస్తూ వస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఆమెను కలిసి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని ఆశపెట్టారు.

Three Arrested For Allegedly Raping Model In Delhi

ముంబైలో ఉన్న ప్రముఖ దర్శకుడు కొత్త వాళ్ల కోసం చూస్తున్నాడని, ఆ దర్శకుడితో సమావేశం ఏర్పాటు చేయిస్తామని నమ్మబలికారు. డిసెంబర్‌ 25న సరోజినీ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు ఆమెను తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

మర్నాడు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత వారిని పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A model from Bihar was allegedly raped by three men in south Delhi, the police said. The three accused were arrested.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి