బాలికపై అత్యాచారం, హత్య: ముగ్గురికి జీవిత ఖైదు

హర్యానా నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్ కూతురుని ఆ ముగ్గురు అపహరించి, 2011 మే 4వ తేదీన ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి, ఆమె నగ్నదేహాన్ని నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేశారు.
నిందితులను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేసినందుకు నిరసనగా వేలాది మంది కురుక్షేత్ర వాసులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. పిప్లీలోని తన తండ్రిని తీసుకుని రావడానికి బాలిక స్కూటర్‌పై వెళ్తుండగా నిందితులు ప్రయాణిస్తున్న మహీందార్ స్కార్పియో ఆ స్కూటర్‌ను ఢీకొట్టింది.
వెంటనే బాలికను తమ వాహనంలోకి లాక్కున్నారు. తన కూతురు చెప్పిన చోటికి రాకపోవడంతో, మొబైల్ పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు విషయంలో పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. కురుక్షేత్ర పోలీసు సూపరింటిండెంట్ బదిలీ కూడా జరిగింది. చివరకు నిందితులు షాహబాద్‌లో అరెస్టు చేసి, కిడ్నాప్‌నకు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications