వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిగాజయలలితకు ముగ్గురూ తెలుగువాళ్ళే గవర్నర్లు, చెన్నారెడ్డితోనే ఆమెకు గొడవ

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్లు గా వ్యవహరించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :తమిళనాడుతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉంది. దీనితో పాటే తమిళ రాజకీయాలకు కూడ తెలుగువారికి సంబందాలున్నాయి..జయలలిత ముఖ్యమమంత్రిగా ఉన్న కాలంలో తెలుగువారే గవర్నర్లుగా పనిచేశారు. తెలుగువారితో జయకు కూడ అనుబంధం ఉంది. అయితే ఇద్దరు గవర్నర్లతో ఆమెకు మంచి సంబంధాలున్నప్పటికీ ఒక గవర్నర్ తో మాత్రం ఆమెకు అంతగా సంబంధాలు లేవు.

1991లో ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ రాష్ట్ర గవర్నర్ గా మర్రి చెన్నారెడ్డి ఉండేవాడు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు మర్రిచెన్నారెడ్డి మద్య పొసగని పరిస్థితులు ఉండేవి.మర్రి చెన్నారెడ్డి తన అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించేవారని చెబుతుంటారు. అయితే జయలలిత మాత్రం మర్రిచెన్నారెడ్డి వ్యవహరశైలిని తప్పుబడుతూండేవారు. చెన్నారెడ్డి తన అధికార దర్పాన్ని ప్రదర్శించాలని ఆయన ప్రయత్నిస్తే ..ఆయ దర్పాన్ని ఎప్పటికప్పుడు తగ్గించేందుకు ప్రయత్నాలు చేసేది.

రోశయ్య గవర్నర్ గా

three governors from telugu states when jaylalita as tamilnadu cm

తదనంతరం జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్నికైన సమయంలో రోశయ్య ఆ రాష్ట్రానికి గవర్నర్ గా నియామకమయ్యారు. జయలలితతో వరుసగా రెండో దఫా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడ రోశయ్యే ఆ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యకు, ముఖ్యమంత్రి జయలలితకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. వీరిద్దరి మద్య మంచి వాతావరణం ఉండేది.యూపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి భాద్యతల నుండి తప్పుుకొన్న తర్వాత తమిళనాడు రాష్ట్రానికి రోశయ్య గవర్నర్ గా నియామకమయ్యారు. ఎన్ డి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోశయ్య ను కొనసాగించారు.కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చినా రోశయ్య మాత్రం తమిళనాడుకు పూర్తికాలం విధుల్లో ఉన్నారు.

విద్యాసాగర్ రావు

three governors from telugu states when jaylalita as tamilnadu cm

రోశయ్య గవర్నర్ గా భాద్యతల నుండి తప్పుకొన్న తర్వాత మరో తెలుగు వ్యక్తే తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారు. నిజానికి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావుకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా కూడ ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు. విధ్యాసాగర్ రావు బాధ్యతల స్వీకరణ సమయంలోనూ, ఆయన రాష్ట్రానికి వచ్చిన సమయంలో జయలతిత ఉన్నారు.అనారోగ్యంతో జయలలిత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే ఆయన ఆమె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. గతంలొ కూడ ఆపోలో ఆసుపత్రికి వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.రెండు రోజుల క్రితం కూడ ఆయన హుటాహుటిన ముంబాయి నుండి చెన్నైకి వచ్చి ఆమె ఆరోగ్యంపై వాకబు చేశారు.ఆమె మరణించిన సమయంలో కూడ ఆయన చెన్నైలోనే ఉన్నారు.

తెలుగు అంటే మక్కువే

three governors from telugu states when jaylalita as tamilnadu cm

తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే వారు. కొందరు తెలుగువారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకానొక సందర్భంలో జయలలిత అసెంబ్లీలో ఒకానొక సందర్భ:లో తెలుగులో ప్రసంగించి ఆకట్టుకొన్నారు.ఆమెకు హైద్రాబాద్ లో ఇళ్లు ఫామ్ హౌజ్ కూడ ఉంది. వేసవిలో హైద్రాబాద్ లోని తన ఫాంహౌజ్ కు వచ్చి సేదతీరేవారు.

English summary
when jayalalita cm in tamilnadu state, governors from telugu state,in 1991 she was cm tamilnadu, at that time marrichennareddy is the governor , chennareddy,between jay no good relations. when upa governament appointed roshaiah as a governor of tamilnadu, roshaiah term completed as a governor in tamilnadu, after roshaiah, ch vidyasagar rao is incharge governor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X