ఏడుస్తుందని పాపను చంపేసిన తల్లి
బెంగళూరు: అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక ఏడుస్తుందని నోరు, ముక్కు నొక్కిపట్టడంతో మరణించిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. జన్మనిచ్చిన కన్న తల్లి చేతిలోనే ఆ బాలిక ప్రాణాలు పోయాయని పోలీసులు చెప్పారు.
కేజీ హళ్ళిలో నివాసం ఉంటున్న నజియా సుల్తానా (26) అనే మహిళను అరెస్టు చేసి జైలుకు పంపించామని మంగళవారం పోలీసులు చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్ ఆసీఫ్ ను నజియా సుల్తానా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి రుబియా కౌసర్ (3) అనే కుమార్తె ఉంది.
ఒక సంవత్సరం క్రితం కుటుంబ సమస్యలతో ఆసిఫ్ భార్య, కుమార్తెను వదిలిపెట్టి దూరంగా ఉంటున్నాడు. తరువాత నజియా కుమార్తెతో కలిసి కేజీ హళ్ళిలో నివాసం ఉంటున్నది. నెల నుండి రుబియా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నది.

బాలికకు వైద్యం చేయిస్తున్నారు. ఈ నెల 14వ తేదిన రుబియా భాద తట్టుకోలేక ఏడవడం మొదలు పెట్టింది. బాలిక ఎంత సేపటికి ఏడుపు నిలపకపోవడంతో నజియా కుమార్తె నోరు, ముక్కు నొక్కిపెట్టింది. ఆ సందర్బంలో బాలిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
పోలీసులు అరెస్టు చేస్తారని భయపడిన నజియా బట్టలో కుమార్తె శవం చుట్టింది. కొంచెం దూరంలో ఉన్న రెహమానియా మసీదులో కుమార్తె మృతదేహం పెట్టి ఇంటికి వెళ్లి పోయింది. మసీదు పెద్దలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పాప ఫోటోను ఫేస్ బుక్, వాట్సాప్ లో పెట్టారు. పాప గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు మనవి చేశారు. స్థానికులు ఫేస్ బుక్ లో ఫోటో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నజియాను పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపించామని మంగళవారం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications