తిరుమల లడ్డూ వ్యవహారంలో ఫస్ట్ వికెట్ డౌన్- ఎఫ్ఐఆర్ నమోదు

Tirumala Laddu row: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.

కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

Tirumala Laddu Ahmedabad Cyber Crime lodged a complaint against X users

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.

ఈ పరిణామాల మధ్య అమూల్ అపవాదును మూటగట్టుకుంది. జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని లడ్డూ తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన ప్రచారం విస్తృతంగా సాగింది.

దీనిపై గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెెటింగ్ ఫెడరేషన్ (అమూల్) యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. తిరుమల లడ్డూ తయారీ కోసం తాము నెయ్యిని పంపించలేదంటూ వివరణ ఇచ్చింది. దీనిపై ప్రకటన విడుదల చేసింది. అక్కడ వినియోగించే నెయ్యితో తమకు ఏ మాత్రం సంబంధం లేదని పేర్కొంది.

అక్కడితో ఆగలేదు అమూల్ యాజమాన్యం. దీనిపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. అమూల్ సేల్స్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమంత్ గౌని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తిరుమల లడ్డూలకు జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని అమూల్ సరఫరా చేసిందంటూ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో న్యూస్ ఛానల్స్‌లల్లో చూశానని, దీనికి కారణం కొందరు ఎక్స్ యూజర్లని తెలిపారు.

Spirit of Congress, Banjara1991, chandanAIPC, SecularBengali, rahul_1700, profapm, prettypadmaja అనే ఎక్స్ అకౌంట్ యూజర్లపై కేసు నమోదైంది. భారత్ న్యాయ సంహితలోని సెక్షన్లు 334, 196, (1), (ఏ), ఐటీ యాక్ట్‌లోని 67 కింద కేసులు పెట్టినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లవినా సిన్హా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+