ఆర్యన్ ఖాన్ కేసులో పెను సంచలనం-రూ.25 కోట్లిస్తే వదిలేసేందుకు ఎన్సీబీ రెడీ ?
ముంబైలోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ సేవించి పార్టీ చేసుకుంటూ పోలీసులకు దొరికిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ హై ప్రొఫైల్ కేసుపై దేశవ్యాప్త చర్చ జరుగుతుండగా.. తాజాగా ఈ కేసులో మరో సంచలనం నమోదైంది.
ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి కారణమవుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రూ.25 కోట్లు చెల్లిస్తే ఆర్యన్ ఖాన్ ను వదిలేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు ఈ సాక్షి చెప్పడం కలకలం రేపుతోంది. ముంబై డ్రగ్ బస్ట్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టేందుకు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తరపున రూ.25 కోట్లు డిమాండ్ చేశారని సాక్షి ఆరోపించారు.

నోటరీ చేయబడిన అఫిడవిట్‌లో, ఎన్సీపీ సాక్షి కెపి గోసావి యొక్క బాడీగార్డ్ అయిన ప్రభాకర్ సెయిల్, ముంబై డ్రగ్ బస్ట్ కేసు వెనుక ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే తరపున గోసావి రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం పెను సంచలనం రేపుతోంది. నిజాయితీపరుడైన అధికారిగా పేరుతెచ్చుకున్న సమీర్ వాంఖడే ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు అతనితో పాటు ఉన్న వారికి చుక్కలు చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం బయడపడటం ఎన్సీబీకి సైతం ఇబ్బందికరంగా మారింది. అయితే దీనిపై ఎన్సీబీతో పాటు ఇతరులు కూడా నోరు మెదపడం లేదు.
షారుక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్ అరెస్టుపై ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే దీనిపై స్పందించిన సీఎం ఉద్ధవ్ ధాక్రే ఎన్సీబీ అధికారులు కోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాను వదిలిపెట్టి గ్రాముల్లో డ్రగ్స్ తీసుకునే వారిని, సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తోందని బహిరంగంగానే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ కేసు మరింత హై ప్రొఫైల్ కేసుగా మారిపోయింది. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను బయటపడేసేందుకు షారుక్ ఖాన్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయినా ఆర్యన్ కు కనీసం బెయిల్ కూడా లభించడం లేదు. ఇలాంటి తరుణంలో ఎన్సీబీ సాక్షి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications