మోడీకి టెర్రరిస్ట్‌లతో లింక్:అలీ తీవ్రవ్యాఖ్య, మమత ఫైర్

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఇద్రిస్ అలీ ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పఠాన్‌కోట్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్నారు.

అతను ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ప్రధాని మోటీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నట్లుగా నేను భావిస్తున్నానని, అందుకే పఠాన్‌కోట్ తీవ్రవాద దాడి జరిగిందనుకుంటున్నానని, ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన తర్వాత ఈ దాడి ఎందుకు జరిగిందని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని అతను అన్నాడు.

అదే సమయంలో అతను సిపిఐ(ఎం) పార్టీ పైన మండిపడ్డారు. శారదా కుంభకోణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టచ్ చేస్తే సిపిఐ(ఎం) నేతలను నరుకుతామని హెచ్చరించారు. సిపిఐ(ఎం) నేత గౌతమ్ మరోసారి మమతా బెనర్జీ గురించి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు.

TMC warns Idris Ali after MP claims PM Modi has links with Pathankot terrorists

మోడీ పైన వ్యాఖ్యలను ఖండించిన పార్టీ

మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన అలీ పైన ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. అలీ చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తమ పార్టీ అలాంటి వాటిని ఆమోదించదని చెప్పారు. అంతేకాదు, తన వ్యాఖ్యల పైన సమాధానం చెప్పాలని ఇద్రిస్ అలీని కోరుతామని పార్టీ చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అతనిని పార్టీ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+