తమిళనాడు స్పీకర్ ను కలిసిన సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం బిజీ, ఏం జరుగుతోంది ?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి గురువారం చెన్నైలో ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ దనపాల్ తో భేటీ అయ్యారు. గురువారం సచివాలయం చేరుకున్న సీఎం ఎడప్పాడి పళనిసామి స్పీకర్ దనపాల్.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి గురువారం చెన్నైలో ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ దనపాల్ తో భేటీ అయ్యారు. గురువారం సచివాలయం చేరుకున్న సీఎం ఎడప్పాడి పళనిసామి స్పీకర్ దనపాల్ చాంబర్ కు వెళ్లి ఆయనతో చర్చలు జరుపుతున్నారు.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం దనపాల్ ను కలుస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే పన్నీర్ సెల్వం కొందరు మంత్రులతో భేటీ అయ్యి చర్చలు జరపుతున్న కారణంగా ఆయన స్పీకర్ దనపాల్ దగ్గరకు రాలేదని తెలిసింది.

TN CM Palanisamy meets Speaker Dhanapal in Secretariat today.

స్పీకర్ దనపాల్ ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేస్తామని, దిండిగల్ శ్రీనివాస్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తామని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు గురువారం చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న దనపాల్ ను ఆ రాష్ట్ర సీఎం ఎడప్పాడి పళనిసామి కలవడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. సీఎం పళనిసామి వెంట ఇద్దరు మంత్రులు వెళ్లి స్పీకర్ తో చర్చలు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+