వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను కొట్టారు, చొక్కా చించేశారు: దండం పెట్టి, రాజ్‌భవన్‌కు స్టాలిన్

అసెంబ్లీలో తనను కొట్టారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆరోపించారు. 20 మంది ఎమ్మెల్యేలతో పాటు తననను శాసనసభ నుంచి గెంటేశారని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అసెంబ్లీలో తనను కొట్టారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆరోపించారు. 20 మంది ఎమ్మెల్యేలతో పాటు తననను శాసనసభ నుంచి గెంటేశారని చెప్పారు. తనను బలవంతంగా గెంటేశారన్నారు. తన చొక్కాను చించేశారని ఆరోపించారు.

ఆయన గుండీలు విప్పేసిన చొక్కాతో కనిపించారు. తన సహచర ఎమ్మెల్యేలతో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో జరిగిన విషయాలను వివరించారు. న్యాయానికి అన్యాయం జరిగిందని, రహస్య బ్యాలెట్‌ను నిర్వహించాలని తాము డిమాండ్ చేశామన్నారు.

TN floor test Live: M K Stalin evicted from the TN assembly

కానీ స్పీకర్ అందుకు నిరాకరించారన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ను స్పీకర్ అంగీకరించకపోవడం అన్యాయమని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ తీరు బాధాకరమని అన్నారు. అసెంబ్లీ సిబ్బంది తన చొక్కాను చించేశారని చూపుతూ.. దండం పెట్టి కారులో వెళ్లిపోయారు.

సభలో జరిగిన వ్యవహారాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావుకు వివరిస్తానని చెప్పారు. సభ నుంచి నేరుగా ఆయన రాజ్ భవన్ బయలుదేరి వెళ్లారు.

English summary
After ten days of drama, Edappadi Palanisamy was sworn in as Chief Minister of Tamil Nadu. He will take the crucial trust vote in the Tamil Nadu legislative assembly in a short while from now. He requires the support of 117 MLAs to pass the test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X