వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేం బలపరీక్ష?: డీఎంకే పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో ముఖ్యమంత్రి పళనిస్వామి అన్యాయంగా నెగ్గారని, ఆయన బల పరీక్ష చెల్లదని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచార

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో ముఖ్యమంత్రి పళనిస్వామి అన్యాయంగా నెగ్గారని, ఆయన బల పరీక్ష చెల్లదని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటి(బుధవారం)కి వాయిదా వేసింది.

తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం జరిగిన తీరును ప్రతిపక్ష నేత స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. కోర్టు సీఎం నియామకంపై విచారణ జరపాలని స్టాలిన్ ఈ పిటిషన్‌లో కోరారు. ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా బయటకు పంపి, విశ్వాస పరీక్షలో పళని నెగ్గారని ఆయన పేర్కొన్నారు. విపక్ష సభ్యులు లేకుండా బల పరీక్ష ఎలా జరిపారని స్పీకర్‌ను ప్నశ్నించారు.

TN floor test: Madras HC to hear plea tomorrow

ఎమ్మెల్యేలను శశికళ అనుచరులు బెదిరించారని, అందుకే పళనికి అనుకూలంగా వారంతా ఓటు వేశారని స్టాలిన్ ఆరోపించారు. రహస్య ఓటింగ్‌కు స్పీకర్ అనుమతినివ్వకపోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వచ్చే సమావేశాల్లో స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామని కూడా స్టాలిన్ తెలిపారు.

English summary
The Madras high court will hear a plea seeking to declare the floor test held in the Tamil Nadu legislative assembly as null and void on Wednesday. The DMK had filed a plea seeking to declare the floor test as null and void and the required procedures had not been followed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X