11 మంది సజీవదహనం, లేడీ టీచర్లు ఏం చేశారో చూడండి, మానవత్వం లేదు, రక్షణ శాఖ!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని తేనీ జిల్లాలోని కురంగణి అటవి ప్రాంతాల్లోని పర్వతాల్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి ఇప్పటి వరకూ 11 మంది మరణించారు. మరో ఏడు మంది మంటల్లో కాలిపోయి తేనీ, మదురై జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కురంగణి పర్వతాల్లో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో రక్షణ శాఖ కీలకపాత్ర పోషించింది. ఇదే ప్రాంతంలో ఉన్న లేడీ టీచర్లు చేసిన పనికి స్థానికులు మండిపడుతున్నారు.

సీఎం పళని ఫోన్

సీఎం పళని ఫోన్

తేనీ జిల్లాలోని కురంగణి పర్వతాల్లో మంటలు వ్యాపించి ట్రెక్కింగ్ కు వెళ్లిన 38 మంది చిక్కుకున్నారని సమాచారం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫోన్ చేసి సహాయం చెయ్యాలని మనవి చేశారు.

కేంద్రం సహకారం

కేంద్రం సహకారం

సీఎం ఎడప్పాడి పళనిస్వామి సమాచారం ఇచ్చిన వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడు హెలికాప్టర్లను కురంగణి పర్వాతాల దగ్గరకు పంపించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని రక్షణ శాఖ సిబ్బందికి నిర్మలా సీతారామన్ సూచించారు.

రెస్కూ టీం

రెస్కూ టీం

సహాయక చర్యలు చేపట్టిన రక్షణ శాఖ వైమానిక సిబ్బంది 27 మందిని రక్షించారు. సహాయక చర్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యవేక్షించారు. 27 మందిని రక్షించిన వైమానిక దళం సభ్యులను పలువురు అభినందించారు.

రెస్కూ హెలికాప్టర్

రెస్కూ హెలికాప్టర్

కురంగణి అటవి ప్రాంతంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అడవుల్లో మూడు రెస్కూ హెలికాప్టర్లు ల్యాండ్ చేశారు. కురంగణి పర్వతాల పరిసర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 30 మంది స్వచ్చందంగా సహాయక చర్యలకు సహకరించారు.

లేడీ టీచర్ల అతి

లేడీ టీచర్ల అతి

కురంగణి అటవి ప్రాంతం సమీపంలో ట్రైనింగ్ తీసుకుంటున్న లేడీ టీచర్లు రక్షణ శాఖకు చెందిన రెస్కూ హెలికాప్టర్ల దగ్గరకు చేరుకున్నారు. ఒక పక్క సహాయక చర్యలు కొనసాగుతుంటే బాధితులపై జాలి చూపించకుండా చిక్కింది ఇదే చాన్స్ అంటూ లేడీ టీచర్లు సెల్ఫీలు తీసుకున్నారు.

ఏం చేస్తున్నారు

ఏం చేస్తున్నారు

రక్షణ శాఖ హెలికాప్టర్ల దగ్గర లేడీ టీచర్లు ఇష్టం వచ్చినట్లు ఫోజులు ఇచ్చి సెల్ఫీలు తీసుకుంటుంటే స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. బాధితుల గురించి ఆలోచించకుండా మీరు ఏం చేస్తున్నారని లేడీ టీచర్లను స్థానికులు నిలదీశారు.

మానవత్వం లేదు

మానవత్వం లేదు

మానవత్వం మరిచిపోయి సెల్ఫీలు తీసుకున్న ట్రైనింగ్ లేడీ టీచర్ల మీద స్థానికులు మండిపడ్డారు. బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చడానికి ప్రయత్నించుకుండా రక్షణ శాఖ హెలికాప్టర్ల ముందు సెల్ఫీలు తీసుకున్న లేడీ టీచర్ల మీద చర్యలు తీసుకోవాలని తేనీ జిల్లా ప్రజలు తమిళనాడు విద్యాశాఖ అధికారులకు మనవి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Training teachers took selfie in front of Indian navy's rescue operation helicopter which is landed at Kurangani fire forest irritates others.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి