సీబీఐ తొలి మహిళా చీఫ్‌గా అర్చనా రామసుందరం!?
ఐపీఎస్ ఆఫీసర్ అర్చనా రామసుందరం దేశంలోనే తొలి మహిళా సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అర్చనా రామసుందరం దేశంలోనే తొలి మహిళా సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్ ఆఫీసర్ ఆర్కే ఆస్థానాను తాత్కాళిక సీబీఐ చీఫ్ గా నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడా స్థానాన్ని అర్చనా రామసుందరంతో భర్తీ చేయనున్నారు.

కాగా, సీబీఐ చీఫ్ గా ఏకె సిన్హా పదవీ బాధ్యతలు ముగియడంతో మధ్యంతర
ఉత్తర్వుల ద్వారా ఆస్థానాను ఆ స్థానంలో నియమించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ నియమాకాన్ని సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని వివాదాల నడుమ ఆస్థానాను ఇక కొనసాగించడం కష్టమనే చెప్పాలి.
సీబీఐ చీఫ్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం నాడు సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన న్యాయమూర్తి జేఎస్ శేఖర్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సీబీఐ చీఫ్ పదవి కోసం మొత్తం 45మంది పేర్లను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో తెలంగాణ అధికారి అరుణ బహుగుణ నుంచి అర్చనా రామసుందరంకు గట్టి పోటి ఎదురవుతుండటం గమనార్హం.
అయితే అర్చనా రామసుందరంకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నశస్త్రసీమాబల్(ఎస్ఎస్.బి) చీఫ్ గా అర్చనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications