వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవగ్రహాల పూజపై ఉన్న శ్రద్ధ.. రైళ్లపై లేదుగా.. అధికారుల తీరుపై జనాగ్రహం..!

|
Google Oneindia TeluguNews

ముంబై : సెంట్రల్ రైల్వే అధికారుల నవగ్రహ పూజలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాధికారులై ఉండి పూజలు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా పూజలు నిర్వహించారనే విషయం వెలుగుచూసింది. దాంతో అధికారుల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా ముంబైలో ఎక్కువ శాతం మంది రవాణాపరంగా రైళ్లపైనే ఆధారపడతారు. ఆఫీసులకు వెళ్లాలన్నా.. పనుల మీద బయటకు వెళ్లాలన్నా.. మాగ్జిమమ్ ట్రైన్లనే ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో కొన్ని రోజులుగా లోకల్ రైళ్లు నత్తనడకన సాగుతున్నాయి. తరచుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుండటంతో రైల్వే అధికారులు జనాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

To overcome snags CR seeks divine intervention organise puja

ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. ఇకపై తెలుగులో కూడా..!ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. ఇకపై తెలుగులో కూడా..!

అయితే ఎలాంటి అవాంతరాలు లేకుండా.. ఇంకెలాంటి తలనొప్పులు రాకుండా రైళ్లు సజావుగా నడవాలని కోరుకుంటూ శనివారం నాడు ఆఫీసులో నవగ్రహ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారనే టాక్ వినిపించింది. అయితే రైళ్లల్లో ఏర్పడ్డ లోటుపాట్లు కనిపెట్టకుండా ఇలా పూజలు చేస్తే ఏం లాభమంటూ కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

అదలావుంటే నవగ్రహ పూజలపై వచ్చిన వార్తల్ని రైల్వే అధికారులు ఖండించారు. తరచుగా ఆఫీసులో ఇలాంటి పూజలు నిర్వహిస్తామే తప్ప.. అందరూ అనుకుంటున్నట్లు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేసింది కాదని చెబుతున్నారు. అయితే ముంబై సెంట్రల్‌ లైన్‌ సబ్‌ అర్బన్‌ రైళ్లలో ప్రతినిత్యం సుమారుగా ఇరవై లక్షల మంది ప్రయాణిస్తారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 400 రైళ్లు రద్దు కాగా... మరో మూడు వేల ట్రైన్లు ఆలస్యంగా నడిచాయి. ఆ క్రమంలో రైల్వే అధికారుల తీరుపై జనాలు మండిపడ్డారు.

English summary
Central Railway, which has been plagued by unfortunate incidents in recent weeks, has sought divine intervention. CR's mumbai division conducted navagraha puja at CSMT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X